ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.  అయితే ఫిబ్రవరిలో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రభావం మార్చి, ఏప్రిల్ లో ఎక్కువ కేసులు, మరణాలు సంబవించాయి.  అయితే కరోనా సమయంలో పుట్టిన పిల్లలకు కరోనా, కోవిడ్, లాక్ డౌన్,  శానిటైజర్ వంటి పేర్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇదే సీజన్ నడుస్తుంది.. అందుకే వెరైటీగా ఉంటుందని.. ఈ గుర్తు మంచికో చెడుకో గుర్తుండి పోతుందని తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఇలాంటి చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు.  ఆ మద్య  రాయపూర్ కు చెందిన దంపతులు తమకు పుట్టిన కవల పిల్లలకు కోవిడ్,  కరోనా అని పేరుపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన  తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన బాబుకు శానిటైజర్ అనిపేరు పెట్టి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఇక కరోనా కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి వలస కూలీలు కష్టాలు పడుతు్న్నారు.

 

తాజాగా  పుట్టిన పురిటి బిడ్డకు లాక్ డౌన్ యాదవ్ అని పేరు పెట్టింది చిన్నారి తల్లి. ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ కు చెందిన రీటా యాదవ్ ముంబైలో వలస కూలీగా పనిచేస్తుంది. గర్భవతిగా ఉన్న ఆమె  కరోనా కారణంగా తన స్వగ్రామమైన ఉత్తర్ ప్రదేశ్ కు  ముంబై నుంచి  శ్రామిక్ రైలులో భయలుదేరింది.కొద్దిసేపటికి రీటా యాదవ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు లాక్ డౌన్ యాదవ్ అని పేరు పెట్టింది.  లాక్ డౌన్ లో పుట్టిన బిడ్డకు నా సోదరి లాక్ డౌన్ అని పేరు పెట్టాలని నిర్ణయించింది.

 

చిన్ని లాక్ డౌన్ ను అందరూ ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు బుర్హాన్ పురా కలెక్టర్ , రైల్వే అధికారులు, స్థానిక సిబ్బంది నామేనల్లుడిని బాగా చూసుకున్నారు. వారిని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. వారికి నాప్రత్యేకమైన ధన్యావాదాలు, నా సోదరికి, ఆమె కుటుంబ సభ్యులకు  అభినందనలు అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ అందర్ని ఆకట్టుకుంటోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: