కొంతమంది మహిళలకి గర్భందాల్చిన సంగతి కూడా తెలియకుండా చివరికి పురిటి నొప్పులు వచ్చేంతవరకు వారు గర్భవతి అన్న విషయం తెలియని సంఘటనలు ఇప్పటివరకు చాలానే చూశాం. అలాంటి సంఘటన మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... 

 

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని ఆడ బిడ్డకు జన్మనివ్వడం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. ఒంగోలు పట్టణానికి చెందిన ఆ బాలిక అద్దంకి పట్టణంలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇకపోతే ఆ అమ్మాయి గత మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆదివారం నాడు ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో వారి తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ అ డాక్టర్లు అవి కడుపు నొప్పి కాదని, అవి పురిటి నొప్పులు అని డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత వారు ఆ అమ్మాయికి ప్రసవం చేశారు. ప్రసవం చేసినాక బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగానే ఉన్నారు.

 


ఇకపోతే ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి పూర్తి విచారణ చేపట్టారు. ఇక ఈ విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మైనర్ బాలికకు  ప్రసవం ఎలా చేస్తారు అని పోలీసులు డాక్టర్లను నిలదీశారు. దానితో టాక్టర్లు ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు అని తల్లిదండ్రులు చెప్పడంతోనే మేము డెలివరీ చేశామని డాక్టర్లు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఆ అమ్మాయి పుట్టిన  బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మిస్టరీ గా మారిపోయింది. అమ్మాయికి ఇంతకు ముందు ప్రేమ వ్యవహారం ఉందా లేక ఎవరైనా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు అన్న పూర్తి వివరాలను అమ్మాయి దగ్గర నుంచి, వారి కుటుంబ సభ్యులు నుంచి పోలీసులు సేకరించి విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: