ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పైపు సొంత స్నేహితులు, కుటుంబ సభ్యులు హత్యలకు పలు పడుతుంటే మరోవైపు ఏదో ఒక విషయంపై భార్యాభర్తలకు గొడవలు పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే భర్త తిట్టాడు అనే బాధతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

IHG


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా బైరెడ్డి పల్లె సమీపంలో నెల్లిపట్ల సొంత పేట గ్రామానికి చెందిన మునిరత్నం భార్య భాగ్యమ్మ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక మునిరత్నం రోజువారి కూలీలుగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కూలి పనులు ఏమీ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఆయన మద్యానికి బానిసై భార్యను వేధించడం మొదలుపెట్టాడు. రెండు రోజుల క్రితం మీ ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవడం జరిగింది. కూలిపనులకు వెళ్లకుండా మద్యం తాగితే కుటుంబాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తారు అంటూ భార్య ప్రశ్నించడంతో మునిరత్నం మందలించడం జరిగింది.

IHG

దీనితో భాగ్యమ్మకు జీవితంపై విరక్తి పుట్టి గ్రామ సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన సమాచారాన్ని స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరి అంజమ్మ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయడం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు అధికారులు పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: