అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ప్రేమ వల వేస్తూ పదుల సంఖ్యలో అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేసిన ఒక ప్రబుద్ధుడు వివరాలు బయటికి వచ్చాయి. మీరు అందంగా ఉన్నారు అంటూ లేనిపోని మాటలు చెబుతూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ వారి వద్ద నుంచి వ్యక్తిగత ఫోటోలను సేకరించి ఆ ఫోటోలను మార్పింగ్ చేసి వాటితో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు నెల్లూరుకు చెందిన ఒక యువకుడు. తన ఉచ్చులో బిగించి వారితో ఆ వ్యక్తి తన కోరికలు తీర్చుకునేందుకు ఇలాంటి పని చేస్తున్నాడు ఆ కామాంధుడు. అయితే ఇలా అతడి మాయమాటలకు మోసపోయిన ఒక బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా పోలీసులకే ఆశ్చర్యాన్ని కలిగించే అనేక సంఘటనలు బయటికి వచ్చాయి. చివరకు ఫోన్ ద్వారా సాగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో నిందితుడిని పక్కా ఆధారాలతో చేధించి అతడిని అరెస్టు చేశారు. దీంతో అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో పోలీసులు అతనిని జైలుకు తరలించారు.


ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరుకు చెందిన ప్రశాంత్ ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. సోషల్ మీడియాలో ఆరితేరిన అతడు అమాయకమైన బాలికలు, పెళ్లైన యువతులు ఇలా చాలా మంది మహిళలపై ప్రేమ వల విసిరి వాళ్లని నిలువుగా ముంచేస్తున్నాడు ఈ కామాంధుడు. తాను చెప్పింది చేయాలని, తన చెప్పిన చోటికి రావాలని లేకుంటే వారి దగ్గర నుంచి సేకరించిన ఫోటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు ప్రశాంత్. ఒకవేళ అలా చేయకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తానని వారిని బెదిరించి సాగారు. అయితే ఈ విషయంలో మోసపోయిన ఒక యువతి ధైర్యం చేసి నెల్లూరు దిశ మహిళా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందించగా వారు ఈ కేసు విచారణలో అతని మెయిల్ లోని సమాచారాన్ని పరిశీలిస్తే అందులో కేవలం అమ్మాయిల నగ్న చిత్రాలు, వీడియోలు మాత్రమే కనిపించాయి. అయితే ఆ ఈ - మెయిల్ లో కేవలం ఎనిమిది మందికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు చాటింగ్ లు మాత్రమే లభించాయని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి, గూడూరు అలాగే తిరుపతి నగరంలోనూ అతని బారిన పడి అనేక మంది యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ఫోన్ లో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అతని ఫోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రశాంత్ లాంటి మోసగాళ్లు ఉన్నంతకాలం మహిళలు జాగ్రత్తగా ఉండాలని అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: