చంద్రబాబు రాజకీయంగా గండర గండడే. ఎందుకంటే ఆయన పార్టీకి  చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాభవం గత ఎన్నికల్లో ఎదురైనా బలంగా పోరాడుతున్నారు. అలాగే చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నా వైసీపీ కిందా మీద పడుతోంది అంటే బాబు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులే కారణంగా చెప్పుకోవాలి.

 

ఏడాది పూర్తి అవుతోంది వైసీపీ అధికారంలోకి వచ్చి. జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. చేతికి ఎముక లేనట్లుగానే ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అనేక పధకాలు అమలు చేస్తున్నారు. అయినా కూడా రావాల్సిన ఇంప్రేషన్ జనాల్లో రావడంలేదు. పైగా ప్రతీ రోజూ ఏదో దాని మీద రచ్చ రచ్చగా ఉంది. ప్రతీ విషయం రాజకీయంగా నానా యాగీకి దారితీస్తోంది.

 

ఇక కోర్టుల్లో కూడా ఇబ్బందులు తప్పడంలేవు. చంద్రబాబు ప్రతీ చిన్న విషయాన్నిచిరిగి చాట చేసి మరీ  పెద్దది చేస్తున్నారు. ఇక సర్కార్ ఇమేజ్ దాంతో డ్యామేజ్ అవుతోంది. పైగా సరైన టైమింగ్ చూసుకోకుండా వైసీపీ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలే ఆ పార్టీకి ఎదురుకొడుతున్నాయని అంటున్నారు.

 

అందులో ఒకటి విద్యుతు చార్జీల పెంపు.  ఓ వైపు కరోనామహమ్మారి, మరో వైపు లాక్  డౌన్. ఎవరికీ చేతిలో చిల్లి గవ్వ లేని వేళ ఈ బాదుడు నిజంగా మండించేదే.  నిజానికి మేము చార్జీలను పెంచలేదని వైసీపీ సర్కార్ అంటోంది కానీ జనాలకు వీరబాదుడే బిల్లుల్లో కనిపించాయి.

 

మధ్యతరగతి, సామాన్యుడు అసలు తట్టుకోలేని విషయంగా ఇది ఉంది. దీని మీద చంద్రబాబు ఇపుడు ద్రుష్టి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. విద్యుతు అన్నది సామాన్యుడిని కనెక్ట్ చేసే అంశం. పూరి  గుడిసెలో కూడా ఇపుడు విద్యుత్ ఉంది. దాంతో పేదలు, మధ్యతరగతి వర్గాలను కలుపుకుని విద్యుతు ఉద్యమాన్ని పెద్ద స్థాయిలో చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నారుట.]]

 

 

లాక్ డౌన్ ఇలా సడలిస్తారో లేదో అలా బాబు దీని మీదనే పోరాటం స్టార్ట్ చేస్తారట. ఓ విధంగా ప్రజలు అంతా అధిక విద్యుతు బిల్లుల మీద మండుతున్నారు. దాంతో బాబు చేతిలో బ్రహ్మాస్త్రమే రెడీగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
 

మరింత సమాచారం తెలుసుకోండి: