పేరుకి ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావు...తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు హోదాలో అప్పుడప్పుడు లేఖల ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కూడా రాష్ట్ర అప్పులపై ఓ లేఖ రాశారు. జగన్‌ తొలి ఏడాదే రూ.82 వేల కోట్లు అప్పు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేసిన 34 సంక్షేమ పథకాలను జగన్‌ రద్దు చేశారని, ఏడాదిలో ప్రజలపై రూ. 30 వేల కోట్ల భారం పెట్టారని ఓ ఫైర్ అయిపోయారు.

 

అయితే కళా వెంకట్రావు లేఖకు వైసీపీ నుంచి రివర్స్ కౌంటర్లు వచ్చేశాయి. అసలు ఆయన లేఖలు రాయడం కాదని, ఆత్మవిమర్శ చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు మొదట పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదని, చంద్రబాబు మొదట పెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇ‍వ్వాలని టీడీపీ నేతలు అడుగుతున్నారని, బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు.

 

వాస్తవానికి బాబు పెట్టిన మొదట సంతకం రుణమాఫీ అసలు పూర్తిగా అమలు కాలేదు. ఎన్నికల ముందు మొత్తం రుణమాఫీ చేసేస్తానని హామీ ఇచ్చిన బాబు, తర్వాత మాత్రం అధికారంలోకి వచ్చి లక్షన్నర చేస్తానని చెప్పారు. కానీ అది కూడా పూర్తిగా చేయకుండా చేతులెత్తేశారు. దాని వల్ల రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా చివరి విడత రుణమాఫీకు జీవో ఇచ్చారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా తీసుకొచ్చారు. దాని వల్ల రుణమాఫీ పక్కకు వెళ్లిపోయింది.

 

ఇక అప్పులు గురించి కళా వెంకట్రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 82 వేల కోట్లు అయ్యాయని చెబుతున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిందో జగన్ ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. కాబట్టి కళా వెంకట్రావు మాట్లాడిన మాటలు ఆయనకే రివర్స్ అయ్యాయి.            

మరింత సమాచారం తెలుసుకోండి: