ఏపీలో అధికార వైసీపీకి చెందిన సోషల్ మీడియా నిద్రాణ స్థితిలో కి వెళ్లి పోయిందా ? పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏడు ఎనిమిది సంవత్సరాలపాటు ఎంతో శక్తివంతంగా పని చేసిన వైసీపీ సోష‌ల్‌ మీడియాకు ఇప్పుడు ఏమైంది ? తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్న త‌మ కోరిక‌ తీర్చుకునేందుకు వైసిపి సోషల్ మీడియా సైన్యం ఏడెనిమిది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడింది. దీంతో పాటు అప్పట్లో అధికార పార్టీ నాయ‌కులు పెట్టిన ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు..  జైలుకు వెళ్లారు.. దాడులు ఎదుర్కొన్నారు.. వారి కల ఫలించింది జగన్ సీఎం అయ్యాడు. అయ‌నా తమకు ఒరిగిందేమీ లేదన్న నిరాశలో కి వెళ్ళారా ? లేదా మా కోరిక తీరింది... మా జగనన్న సీఎం అయ్యాడు అని నిద్రాణ స్థితిలో కి వెళ్ళిపోయారో ? ఏమో గాని ప్రస్తుతం వైసిపి సోషల్ మీడియా సైన్యం ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా కౌంట‌ర్ ఎటాక్‌ చేయలేకపోతుంది అన్నది వాస్తవం.

 

తాజాగ టీటీడీ నిరర్ద‌క ఆస్తుల‌కు సంబంధించి వేలం ప్ర‌క్రియ‌పై టీడీపీ.. ఇత‌ర సోష‌ల్ మీడియా సైన్యాలు జ‌గ‌న్ టీటీడీ ఆస్తుల‌ను వేలం వేస్తున్నారంటూ ... త‌ద్వారా హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తు న్నార‌ని విస్తృతంగా.. ఓ విధంగా చెప్పాలంటే విషాన్ని వెద‌జ‌ల్లుతున్నాయి. దీనిపై ఎవ‌రో ఒక‌రిద్ద‌రు నాయ‌కులు ప్రెస్ మీట్లు పెట్టి కౌంట‌ర్లు ఇచ్చినా ఉప‌యోగం ఉండ‌దు. అదే సోష‌ల్ మీడియా రంగంలోకి దిగి ఇదంతా నాడు టీడీపీ పాల‌న‌లోనే తీర్మానం చేశార‌న్న విష‌యం బ‌లంగా చెప్ప‌లేక‌పోతున్నాయి. 

 

ఇక జ‌గ‌న్ సీఎం అయ్యాక అటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే విష‌యంలో సీరియ‌స్ గా ఉంటున్నారే త‌ప్పా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను మాత్రం నిర్వ‌హించ‌డం లేదు. దీంతో అనుబంధ విభాగాలు కూడా నిస్తేజంలోకి వెళ్లాయి. ఈ క్ర‌మంలోనే పార్టీ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా ఉన్న వారితో పాటు సోష‌ల్ మీడియాను ఎందుకు యాక్టివ్ చేయ‌ట్లేదని కీల‌క బాధ్యుల‌కు సీరియ‌స్‌గా చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఇప్ప‌టియి అయినా వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివ్ అవుతుందో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: