నిజంగా అడుగు తీసి అడుగు ముందుకు పెడితే ఎన్నో విమర్శలు, మరెన్నో రాజకీయ బాణాలు, మాటల దాడులు, ఆందోళనలు. మిన్ని విరిగి మీద పడినట్లుగా రచ్చ రచ్చ ఏపీలో గత ఏడాదిగా ఇదే జరుగుతోంది, నిజంగా ఇదంతా చూస్తూంటే ఇంతటి చైతన్యం విపక్షాల్లో అయిదేళ్ల బాబు కాలంలో ఎందుకు కనిపించలేదన్న ప్రశ్న తప్పనిసరిగా అందరికీ వస్తుంది.

 

ఓర్వలేక, అసూయతో చేస్తున్న ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. నిజంగా జగన్ విజయం  పలువురికి క‌ళ్ళు కుట్టేది. అంతా అదిరిపోయే అధ్బుత విజయం. జగన్ని ఒక నాయకుడిగా కూడా అంగీకరించని వారికి ఆయన ఇపుడు ముఖ్యమంత్రిగా ఉండడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు, ప్రజలు  దేవుళ్ళు వారే అసలైన తీర్పరులు. అందుకే జగన్ కి బంపర్ మెజారిటీ ఇచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. దాంతో అన్ని రాజకీయ పక్షాల్లో ఒకే బాధగా ఉన్నట్లుంది.

 

అయిన దానికీ కానిదానికీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. ఈ టైంలో ఒక ఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవుడికి సంబంధించిన భూములను వేలం వేస్తారని, ఈ వార్త ఇలా వచ్చిందో లేదో ప్రతిపక్షం పూనకం ఎత్తేసింది. ఠాట్ అలా చేస్తారా అంటూ దండెత్తింది. నిజంగా ఇది సున్నితమైన అంశం. కానీ ఇపుడు ఆరోపిస్తున్న‌ ప్రతిపక్షాలే గతంలో ఈ తీర్మానం చేశాయన్నది కూడా తెలిసిందే.

 

కానీ నాడు మౌనంగా ఉన్న మీడియా, ఇతర పెద్దలు ఇపుడు ఇదే టైం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు. దాంతో ఇది చాలా తీవ్రమైన అంశమైంది. టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు జగన్ మెడకు కూడా చుట్టుకుంది. దాంతో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇది కేవలం సమీక్ష మాత్రమే. భూములు అమ్మమని క్లారిటీగా చెప్పేశారు. పైగా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది.

 

మొత్తానికి వైసీపీ సర్కార్ కానీ, టీటీడీ కానీ పంతానికి పోకుండా తెలివిగా వేగంగా స్పందించి వ్యవహరించింది. ఇదే మరి కొన్ని రోజులు నానిస్తే ఇంకా పెద్ద సమస్య గా మారి రచ్చ రచ్చగా మారేది. అంతదాకా రానీయకుండా చేసుకున్నందుకు వైసీపీ పెద్దల వివేచనను అభినందించాల్సిందే. ఏది ఏమైనా ఏపీలో ప్రతిపక్షం అంతా ఒక్కటిగా ఉంటోంది. మీడియా సహకారం కూడా అటే ఉంది. దాంతో ఆచీ తూచీ సున్నితమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీకి ఈ ఘటన తెలియచేసిందనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: