జగన్ ముఖ్యమంత్రి అవటానికి గల కారణాలలో ఒకటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా. ప్రతిపక్ష నేతగా జగన్ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటాల విషయంలో చంద్రబాబు కి అండగా ఉండే ఎల్లో మీడియా జగన్ పై దుష్ప్రచారం చేస్తూ వచ్చేది. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆ టైంలో ఉన్న వాస్తవాలను బయటపెట్టి చంద్రబాబు సర్కార్ కి మరియు ఎల్లో మీడియా కి చుక్కలు చూపించేది. ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ జగన్ ని బాగా ప్రమోట్ చేసేది. అటువంటిది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైసిపి సోషల్ మీడియాలో చురుకుతనం తగ్గినట్లు ముందు నుండి వార్తలు వినబడుతున్నాయి. దీనికి కారణం చూస్తే జగన్ అధికారంలోకి వచ్చినా వైసీపీ సోషల్ మీడియా వింగ్ కి ఒరిగేందేమీ లేదన్నది సమాచారం.

 

జగన్ సీఎం అయ్యాక అమరావతి, ఎల్జి పాలిమర్స్ కంపెనీ ఘటన తర్వాత తాజాగా టీటీడీ నిరర్థ‌క ఆస్తుల వేలానికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా భయంకరంగా విష ప్రచారం చేస్తోంది. ఇలాంటి విషయాలలో వైసిపి సోషల్ మీడియా పట్టించుకోకపోవడంపై మరియు ఖండించకపోవడం పై విమర్శలు పార్టీలో వస్తున్నాయి. మతాలకు మనుషుల బావోద్వేగాలకు సంబంధించిన విషయాలలో టీడీపీ మరియు దానికి సంబంధించిన అనుబంధ మీడియా సంస్థలు చెలరేగి పోతున్న గాని వైసిపి సోషల్ మీడియా ఇదివరకు లాగా వ్యవహరించకపోవడం పట్ల వైసిపి పార్టీ కి చాలా డ్యామేజ్ పబ్లిక్ లో జరుగుతున్నట్లు టాక్.

 

టీటీడీ ఆస్తులను జగన్ అమ్మకానికి శ్రీకారం చుట్టారని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఇక్కడ విషయం చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుతం పాలకమండలి లో వైసీపీ నేతృత్వంలో ఉన్న వై.వి సుబ్బారెడ్డి ఆమోదం తెలపడం మాత్రం జరిగింది. జగన్ సర్కార్ సొంతంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. అటువంటి టీటీడీ విషయంపై తెలుగుదేశం పార్టీ మీడియా మరియు సోషల్ మీడియా భయంకరంగా దుష్ప్రచారం చేయటాన్ని ఖండించలేని వైకాపా సోషల్ మీడియా పై పార్టీలో ఉన్న నాయకులే  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోపక్క పార్టీ కోసం పని చేసినా మాకు ఒరిగిందేమీ లేదని వైకాపా సోషల్ మీడియా శ్రేణులు అంటున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: