గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రధానంగా టీటీడీ వెంకన్న ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అధికార పార్టీని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చినా ఈ వివాదం సద్దుమణగడం లేదు. శ్రీవారి ఆస్తుల వేలం విషయంలో భక్తుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ వివాదం వల్ల ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
మరోవైపు దేవాలయ ఆస్తుల విషయంలో అసలు చర్చ తప్పించి ఏదేదో చర్చ జరుగుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీటీడీ 50 ఆస్తుల అమ్మకానికి సంబంధించి కమిటీ వేసింది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వారే పాలకమండలిలో ఉంటారు. టీటీడీ నిరర్థక ఆస్తులు అమ్మివేయాలని నిర్ణయం తీసుకుంది. నిరర్థక ఆస్తుల వల్ల టీటీడీకి ఎటువంటి ఆదాయం చేకూరదు. 
 
నిరర్థక కమిటీ 50 భూములను వేలాలు వేయడానికి సిఫారసు చేయగా బీజేపీ, టీడీపీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మాత్రం టీడీపీ హయాంలో కూడా టీటీడీ భూముల అమ్మకాలు జరిగాయని చెబుతోంది. భక్తులు ఆలయానికి సేవ కోసం భూములు ఇచ్చారు. ఆ భూములను ధార్మిక సేవల కొరకు ఉపయోగిస్తే ప్రయోజనం చేకూరుతుంది. కానీ టీటీడీ అమ్మి ఆ నగదును డిపాజిట్ చేస్తామని చెబుతోంది. 
 
ఆలయానికి సంబంధించిన విషయంలో భక్తులు అధ్యాత్మిక సేవ కోసం డబ్బులు ఇచ్చారని.... అధ్యాత్మికంగా ప్రయోజనం చేకూరేలా ఉపయోగిస్తే మంచిదని... ఆ ఆస్తులు అమ్మడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భక్తుడు దేవస్థానాన్ని నమ్మి, దేవుడిని నమ్మి ఇచ్చిన ఆస్తులను అమ్మడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఈ లాజిక్ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదని కొందరు భక్తులు చెబుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: