దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 
 
రాష్ట్రంలో ఈరోజు నమోదైన కేసులతో కలిపి 2671 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు 1848 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 767 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో జగన్ సర్కార్ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
మొదట్లో తక్కువ సంఖ్యలో ఏపీలో పరీక్షలు జరగగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల సహాయంతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 3,00,000 దాటింది. రాష్ట్రంలో ఒక మిలియన్ జనాభాకు 5,699 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగలేదు. 
 
అప్పట్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని ప్రభుత్వాని కి సూచనలు చేసిన వారు నేడు ముక్కున వేలేసుకునేలా ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిరోజూ 10,000కు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపింది. కరోనా పరీక్షల్లో లక్షణాలు కనిపించని వారే భారీ సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య మాత్రo భారీగా పెరుగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసి కరోనాను పూర్తి స్థాయిలోకి అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఐతే ప్రభుత్వంపై ఉంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: