కరోనా వైరస్ ప్రపంచంలో విలయ తాండవం చేస్తోంది. మొదటిలో లాక్ డౌన్ అమలు చేస్తే చాలు చాలావరకూ కంట్రోల్ అయిపోతుంది అని భావించియి ప్రపంచ దేశాలు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఈ వైరస్ అంతమయ్యే వైరస్ కాదు అని నిర్ధారణకు వచ్చాయి. మందులేని కరోనా వైరస్ ప్రపంచంలో ఎంటరైన టైములో దానికి సరైన వైద్య చికిత్స విధానాలు కూడా లేకపోవడంతో వ్యాప్తి చెందకుండా మాత్రమే నివారణ కావటంతో చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి. అయినాగాని ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. పేదవాడు మరియు ప్రధానమంత్రి అని తేడా లేకుండా ఎవరిని పడితే వారిని ఎటాక్ చేస్తూనే ఉంది. ఇటువంటి సమయంలో ఇండియాలో కూడా ఈ వైరస్ ఉన్న కొద్ది బలపడుతోంది. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో అయితే చాలా చోట్ల వైరస్ వ్యాప్తి చెంది ఉంది. ఇండియాలో అత్యధికంగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఎక్కువగా మహారాష్ట్రలోనే కావటం విశేషం.

 

ఇదిలా ఉండగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కి కూడా కరోనా వైరస్ సోకటం అందరికి షాక్ ఇచ్చినట్లు అయింది. దీంతో ఇప్పుడు ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. ఎ టువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో వైద్యులు షాకయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. మాజీ సీఎం కి కరోనా వైరస్ సోకడంతో ఈ వార్త సోషల్ మీడియాలో మరియు మహారాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనంగా మారింది.

 

అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే క్యాబినెట్ లో మంత్రిగా పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా తరచు అనారోగ్యానికి గురికావడంతో అనుమానం వచ్చి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అశోక్ చవాన్ ప్రభుత్వ పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి ముంబై ప్రయాణిస్తూ ఉంటారు. మధ్యలో చాలా మందిని కలుస్తూ ఉండటంతో వ్యాధి సోకినట్టుగా అనుమానిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: