2019 ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందనే అందరూ భావించారు. టీడీపీ పథకాల అమలులో అశ్రద్ధ వహించడం, పార్టీ నేతలకే పథకాలలో ప్రాధాన్యత ఇవ్వడం, పారదర్శక పాలన సాగించకపోవడం ఇతర కారణాల వల్ల రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు వైసీపీ 100 నుంచి 120 సీట్లు సాధించవచ్చని అంచనా వేశాయి. 


 
రాష్ట్రంలో కలలో కూడా అంచనా వేయలేని విధంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ కొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్రంలో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. అయినా ప్రజల్లో జగన్ కు పాలనానుభవం లేకపోవడంతో ప్రజలు కొన్ని సందేహాలు నెలకొన్నాయి. జగన్ పాలన ఎలా ఉంటుందా...? అనే ఆసక్తితో ప్రజలు ఎదురు చూశారు. కానీ జగన్ సంవత్సరం పాలనతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. 

 
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో కుల, మత, పార్టీల తారతమ్యం లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు అమలు చేసి జగన్ గ్రేట్ సీఎం అనిపించుకున్నారు. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 
 

అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలోని 43 లక్షల మంది ఖాతాలలో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేశారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ వాహన మిత్ర, పేదలందరికీ ఇళ్లు, మద్యపాన నిషేధం, వైయస్సార్ కాపు నేస్తం, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినికలు... ఇలా పదుల సంఖ్యలో పథకాలను అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో జగన్ స్థానం సంపాదించుకున్నారు. 
 

వైయస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని ఓదారు యాత్రకు అనుమతి కోరగా పార్టీ అనుమతి ఇవ్వలేదు. ఆ తరువాత అప్పటి కాంగ్రెస్ పార్టీ, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నుంచి జగన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ప్రజల్లో అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తానని నమ్మకం కలిగించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ ఇతర రాష్ట్రాలు సైతం జగన్ నిర్ణయాలను ఆదర్శంగా తీసుకునేలా చేస్తూ రాజన్నను మించి పాలన సాగిస్తూ జగన్ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: