దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 99 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 44 మంది కాగా మిగిలిన 45 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు కావడం గమనార్హం. 
 
నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,896కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లెక్కలు ప్రకటించకపోవడంతో జిల్లాలకు సంబంధించిన కేసుల లెక్కల్లో కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. 
 
రాష్ట్రంలో కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కానీ ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 32 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా మిగిలిన వారు ఇతర దేశాల, రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారని తెలుస్తోంది. నిన్న నమోదైన కేసులో 18 మంది విదేశీయులని తెలుస్తోంది. 
 
నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1920కు చేరుకుంది. వీరిలో 1164 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 72 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన భారతీయలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి చేరుకుంటున్న వలస కార్మికులు కరోనా భారీన ఎక్కువగా పడుతున్నట్టు తెలుస్తోంది. వీరి వల్లే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: