లోకమంతా కరోనా గుప్పిట్లో ఉండగా ప్రజలకు ఈ కష్టాలు చాలవన్నట్లుగా అదనంగా ఇంకా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. ఒక వైపు భానుడు భగభగమంటు రాష్ట్రాలను నిప్పుల కొలిమిలా మారుస్తుంటే, మరో వైపు రోడ్డు ప్రమాదాలు పేదల జీవితాలను కబళిస్తున్నాయి.. ఇది చాలదన్నట్లుగా విశాఖలో విషవాయువుల వల్ల జరిగిన మరణాలు తెలిసిందే.. అంతే కాకుండా హత్యలు, ఆత్మహత్యలు నిత్యం ఉంటూనే ఉన్నాయి.. దీనికి తోడు ఒక మురికి వాడలో చెలరేగిన మంటల వల్ల పేదల నివాసాలు కాలి బుడిదగా మారాయి.. ఆ వివరాలు చూస్తే..

 

 

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తుగ్లకాబాద్ లో సోమవారం అర్దరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం.. దక్షిణ తూర్పు ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఉన్న మురికివాడలోని గుడిసెలకు అందరు నిద్రిస్తున్న సమయంలో మంటలంటుకున్నాయి. కాగా ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 1200 గుడిసెలు దహనమయ్యాయని ఢిల్లీ డీసీపీ రాజేంద్రప్రసాద్ మీనా చెప్పారు. అక్కడి ప్రజలు నిద్రిస్తున్న వేళ ఈ అగ్నిప్రమాదం జరగగానే మెలకువ వచ్చిన ప్రజలు మిగతా వారిని అప్రమత్తం చేస్తూ గుడిసెల్లోనుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈలోపల ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 అగ్నిమాపక వాహనాలలో వచ్చి తుగ్లకాబాద్ మురికివాడలో మంటలను అదుపు చేస్తున్నారు.

 

 

అయితే అగ్నిమాపకశాఖ అధికారులు మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, గుడిసెవాసులను పునరావాస శిబిరానికి తరలించామని పేర్కొన్నారు. ఇకపోతే అగ్నిప్రమాదం ఎలా సంభవించిందన్న వివరాలు తెలియ రాలేదు.. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. ఇందులో భాగంగా స్దానికులను విచారిస్తున్నారు..

 

 

ఇకపోతే ఈ కరోనా అనే మాయదారి రోగం ముఖ్యంగా పేదల జీవితాలతో తన ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటుంది.. దీని బారిన వయస్సుతో నిమిత్తం లేకుండా ఎందరో పేద మధ్యతరగతి ప్రజలు పడుతున్నారు.. వారి బ్రతుకులు అంధాకారంగా మారుతున్నాయి.. చేసే సాయం చిన్నది, అందవలసిన ఫలం మాత్రం చాలా పెద్దది.. ఇప్పటికే దేశంలోని పేదల బ్రతుకులు అల్లోకల్లోలంగా మారాయి.. ఆకలి చావులు కూడా అక్కడక్కద సంభవిస్తున్నాయి.. ఏది ఏమైన ఇప్పుడున్న కాలం విషమ పరీక్షగా పేర్కొనవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: