దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో సామాన్యులు, పేదలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజంలు లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక కష్టాలు పడుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ వీరిని ఆదుకోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వం నేడు వీరి ఖాతాలలో 5,000 రూపాయలు జమ చేయనుంది. సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 
 
ఆన్ లైన్ ద్వారా అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లు, మౌజంల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానుంది. ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ నుంచి ఈ పథకం కొరకు 38 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 31,017 అర్చకులు, 7,000 ఇమాం, మౌజంలు, 29,841 పాస్టర్ల ఖాతాలలో ఈరోజు నగదు జమ కానుంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల భక్తులను ఆలయాలలోకి అనుమతించడం లేదు. దేవుళ్ల దర్శనాలు నిలిచిపోయాయి. 
 
అందువల్ల అర్చకులకు ఆదాయం లేకుండా పోయింది. లాక్ డౌన్ వల్ల మసీదులు, చర్చీలలో మతపరమైన కార్యక్రమాలను నిలిపివేశారు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం గతంలోనే అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజం‌లను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దేవాదాయ‌, మైనారిటీ శాఖ ద్వారా ఆన్ లైన్ లో వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. 
 
వన్‌టైం సహాయం కింద రూ. 5 వేల నగదును ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలో జమ చేయనుంది. ప్రభుత్వం కష్ట కాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో నగదు జమ చేస్తూ ఉండటంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇతర పథకాలను రాబోయే రోజుల్లో అమలు చేస్తున్నట్టు తెలిపారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: