దరిద్రం వెంట ఉంటే మంచివానికి కూడా చెడు జరుగుతుందని పెద్దలు ఊరికే అనలేదు.. అయితే ప్రస్తుత పరిస్దితుల్లో ఎందరో కరోనా బారిన పడుతుండగా అందులో కొందరు స్వచ్చందగా హస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకుంటుండగా, మరికొందరు భయంతో భయపడి దాక్కుంటున్నారు.. కాగా కొందరికైతే అసలు కరోనా వచ్చిన విషయం తెలియక, అంటే కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు బయటపడక పోవడంతో తమకు కరోనా లేదనుకుని స్వేచ్చగా తిరుగుతున్నారు.. ఇలాంటి వారి వల్ల చాలా ప్రమాదం కానీ అది ఈ వైరస్ వీరిలో ఉందని భయటపడే వరకు తెలియదు.. ఈలోపల చక్కగా వ్యాపిస్తుంది.. ఇదిగో ఇప్పుడు ఇలాగే జరిగింది..

 

 

మామూలుగా కరోనా వైరస్ లక్షణాలు సోకినా వెంటనే కనిపించవని తెలిసిందే. కామన్‌గా ఈ కరోనా సోకినా తరువాత 14 రోజుల నుంచి 28 రోజుల వరకు దాదాపుగా ఈ వైరస్ లక్షణాలు బయటకు కనిపించవు.. అప్పటి వరకు కరోనా సోకిన రోగి మామూలు వ్యక్తిలాగే ప్రజల మధ్యలో తిరుగుతుంటాడు.. ఇలాగే కేరళలో ఉన్న ఒక వ్యక్తిని పనసపండు పట్టించింది.. అదెలా అంటే.. బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ పనస పండు కోసం చెట్టు ఎక్కాడట, అయితే దురదృష్టవశాత్తు అతడిపై ఓ పనసపండు పడగా, పట్టుతప్పిన అతను ఆ చెట్టు పై నుంచి కింద పడడంతో, వెన్నెముక, మెడకు తీవ్ర గాయాలయ్యాయి.

 

 

ఈ నేపధ్యంలో అతడిని కసరగడ్ జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారట.. ఈ సమయంలో అతని పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి పరియార్‌లోని కన్నూర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా, అతని వెన్నెముక, మెడకు సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులతో పాటు 18 మందిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. చూశారుగా దరిద్రం అంటే ఇదే.. ఇప్పుడు అతని వల్ల ఎంత మందికి కరోనా అంటిందో చూడండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: