అదేంటీ రెండు పిల్లి పిల్లల గురించి ఇంత గొప్పగా చెప్పాల అంటే.. అవి సామాన్యమైనవి కావు.. ఎంతో అరుదుగా కనిపించేవి. దేవాంగ పిల్లి అనేది లోరిస్డే (Lorisidae) కుటుంబానికి చెందిన జంతువు. ఆంగ్లంలో స్లెండర్ లోరిస్ అని వీటికి పేరు. ఇవి సాధారణంగా శ్రీలంక, దక్షిణ భారత దేశాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. భారత దేశంలో ఇవి ఎక్కువగా అగ్నేయమూల అటవీ శ్రేణుల్లో కనిపిస్తాయి. కేవలం భారత దేశంలోనే కనిపిస్తుంది. వీటికి నంగనాచి , పిగ్మీ, నైట్ మంకీ, మూడు జానల మనిషి అనే పేర్లు కూడా ఉన్నాయి. దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. ఇవి 275 గ్రాముల నుండి 348 గ్రాముల వరకూ బరువుంటాయి. వీటికి గుండ్రటి తల, పెద్ద గోధుమ రంగు కళ్ళు, కళ్ళు చుట్టూరా ముదురు గోధుమ లేదా నలుపు జూలు చుట్టిముట్టి ఉంటుంది.

IHG

చెవులు గుండ్రటి ఆకారంలో పెద్దగా ఉంటాయి. వీపు పై జూలు ఎరుపు -గోధుమ సమ్మేళనం లో ఉండి గుండె భాగం, పొట్ట భాగం పై తెలుపు రంగులో ఉంటుంది. ఆడ దేవాంగ పిల్లులు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 సంవత్సరాలు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు చివరి మలుపులో సమీపంలో కనిపించిన ఈ రెండు పిల్లులను దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. 

IHG

తాాజాగా ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవి అని, శేషాచలం అడవుల్లో నివసిస్తున్నాయని వెల్లడించారు అధికారులు. కాగా, కొన్ని గిరిజన జాతులవారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని విశ్వసిస్తారు.IHG

మరింత సమాచారం తెలుసుకోండి: