లోకంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. అసలు కరోనాకు పుట్టిళ్లు అయినా చైనాను వదిలిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఇప్పటి వరకు 214 దేశాలకు విస్తరించిన ఈ ప్రాంణాంతక వైరస్‌ దాదాపుగా 3,47,872 మందిని పొట్టన పెట్టుకున్నది. కాగా ప్రపంచవ్యాప్తంగా 55,87,582 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ బారిన పడిన వారిలో 23,65,703 మంది కోలుకోగా, మరో 28,74,007 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.. ఈ ఆధునిక కాలంలో అత్యంత శక్తివంతమైన, ఆధునిక రోగంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కరోనా మారుతుంది..

 

 

ఇకపోతే అగ్రరాజ్యమైనా  అమెరికా ప్రస్తుతం కరోనా కేసుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తక్కువ సమయంలో రెండో స్థానానికి దూసుకు వచ్చిన బ్రెజిల్‌ ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఈ దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక కరోనా మృతుల సంఖ్య రష్యాలో తక్కువగానే ఉన్నప్పటికీ, పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయట.. ఇకపోతే భారత్ కరోనా కేసుల జాబితాలో రెండు రోజుల క్రితమే పదో స్థానానికి చేరింది.. ఇది ప్రస్తుత స్దితి..

 

 

అయితే భారత్‌లో ఎండలు మండిపోతున్న సమయంలో కూడా కరోనా వ్యాప్తి ఆగడం లేదు.. ఇప్పటికే చాలా వరకు లాక్‌డౌన్ సడలించడంతో ప్రజల్లో యాక్టివిటీ పెరిగింది.. ఒకవైపు ప్రభుత్వాలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండని చెబుతున్నా సరిగ్గా పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు.. అందులో మాస్కులు కూడా ధరించడం లేదు.. ఇప్పుడే పరిస్దితి ఇలాగే ఉంటే రాబోయే ఎనిమిది నెలల్లో భారత్‌లో పరిస్దితులను అంచనా వేయడం కష్టం.. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అర కోటి దాటిన ఈ కరోనా.. కోటి దాటడానికి అంత సమయం తీసుకోక పోవచ్చును, చాలా వేగంగా కోటికి చేరవచ్చును అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

 

 

ఇక ఏ ప్రభుత్వాలు, వైద్యులు ప్రజలను కరోనా నుండి రక్షించక పోవచ్చు అని అనుకుంటున్నారట. ఎవరికి వారే ఈ రాక్షసుని బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. లేదంటే నూతన సంవత్సరం వరకు ఎవరు ఉంటారో, కరోనాలో కలిసిపోతారో తెలియదట.. ఇది ప్రస్తుత పరిస్దితి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: