నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ తో వణికిపోయిన హైదరాబాద్ తాజాగా భానుడి ప్రభావం తో కొత్త డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. రోజు రోజుకి భానుడి ప్రభావం పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ నగరంలో అల్ట్రావైలెట్ రేస్ ప్రభావం ఎక్కువగా ఉందని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజషన్(WEO) ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో అతినీలలోహిత కిరణాలు ఉన్నాయని తెలిపింది. వేసవికాలం కాబట్టి మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో వివిధ నగరాల్లో అల్ట్రా వైలెట్ రేస్ సూచికను రూపొందిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ తాజాగా హైదరాబాద్ నగరంలో ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు గుర్తించింది.

 

ఇటువంటి ప్రమాదకరమైన కిరణాలు వల్ల మనిషి చర్మం పై మరియు కళ్ళకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అల్ట్రా వైరస్ అనే ఈ కిరణాల వల్ల వేసవికాలంలో స్కిన్ ఎలర్జీ లు అదేవిధంగా కళ్ల సంబంధ సమస్యలతో వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువని వైద్యులు కూడా చెబుతున్నారు. సూర్యుడి నుండి వచ్చే ఈ కిరణాలను అడ్డుకునే శక్తి ఓజోన్ పొరకు లేకపోవటంతో ఎలాంటి ప్రభావం మనిషిపై సూర్యుడు చూపిస్తారని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో వారం రోజుల పాటు ఎవరు కూడా బయటకు రాకుండా ఇంటికి పరిమితం అవ్వాలని అంటున్నారు.

 

ఒకపక్క కరోనా వైరస్ మరోపక్క అల్ట్రా వైలెట్ రేస్ ప్రభావం హైదరాబాదులో ప్రమాదకర స్థాయిలో ఉండటం నిజంగా హైదరాబాదీలకు ఈ ఏడాదీ గడ్డు కాలమే అని చెప్పవచ్చు. కాబట్టి హైదరాబాదు నగరంలో మీ బంధువులు గాని ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే వారంరోజులపాటు బయట తిరగవద్దు అని వైద్యులు మరియు వాతావరణ శాఖ కు సంబంధించిన అధికారులు తెలుపుతున్నారు. మరోపక్క ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన మీరు కూడా హైదరాబాదులో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ విషయం తెలియజేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: