రోజురోజుకి దేశంలో అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఈ అఘాయిత్యాలను పెద్దవాళ్ళు చేయడం చూసి చిన్న పిల్లలు కూడా చేయడం మొదలు పెట్టేశారు. దీనితో అన్యం పుణ్యం ఎరుగని కొంత మంది ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో అసలు విషయంలోకి వెళితే... 


తమిళనాడు రాష్ట్రంలోని మనపూరై పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారి అమ్మాయికి 9 సంవత్సరాలు, ఆ పిల్లవాడికి 14 సంవత్సరాలు. అభం శుభం తెలియని ఆ చిన్నారి అమ్మాయికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు ఓ మైనర్ బాలుడు. అయితే ఆ మైనర్ బాలుడు చేసిన అత్యాచారం ప్రయత్నాన్ని చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ అమ్మాయిని పరలోకానికి పంపించేశాడు ఆ దుర్మార్గుడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కృష్ణ సముద్రం లో ఆదివారం నాడు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన 9 సంవత్సరాల చిన్నారి స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఇక అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల బాలుడు చిన్నారిపై కన్ను వేశాడు. ఇక ఇదే అనువుగా ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఈ గ్రామానికి సమీపంలో ఉన్న మల్లె పూల తోటలోకి చిన్నారిని తీసుకు వెళ్ళాడు. అయితే అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేసేందుకు ఆ యువకుడు యత్నించాడు.


అయితే అనుకోని రీతిలో ఆ చిన్నారి మైనర్ బాలుడును అడ్డుకోవడం జరిగింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన మైనర్ బాలుడు ఆ బాలిక తలపై బండరాయితో కొట్టేసాడు. ఇక ఆ చిన్నారి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత గ్రామంలో కి వచ్చినా మైనర్ బాలుడు ఏమీ తెలియనట్టుగా అక్కడ ఆ చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని స్థానికులకు తెలియజేశాడు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టి ఆ బాలుడు పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నల వర్షం లో మైనర్ బాలుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయి తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అయితే మొదట్లో మాత్రం తాను ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డ లేదన్నట్టు సముదాయించాడు. బండరాయితో కొట్టడం ద్వారా ఆ అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందింది. దీనితో ఆ బాలుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆ మైనర్ బాలుడు ని జువైనల్ హోమ్ పంపారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: