చైనా దేశం ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ఇండియా దేశంలో ఉన్న చైనీయులు వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి అంటూ పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఇండియా నుంచి చైనాకు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం పంపించిన ప్రత్యేకమైన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలి అంటూ ప్రకటించింది. స్వదేశానికి వచ్చే చైనీయులు తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదేశాలను పాటించాలని తెలిపింది. ఈ సందర్భంగా ఇండియా నుంచి చైనా లో దిగబోయే ప్రయాణికులంతా క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. క్వారంటైన్ లో ఉన్న తర్వాత అన్ని నిబంధనలు పాటించని తర్వాత మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని చెప్పుకొచ్చింది.

 

అంతే కాకుండా చైనా దేశం రావాలంటే కనీసం 37.3 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలని అంతకంటే ఎక్కువ ఉంటే ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలని వచ్చిన వెనక్కి పంపి చేస్తామని చైనా ప్రభుత్వం తెలిపింది. కరోనా లక్షణాలు దగ్గు, జ్వరం లాంటివి ఉన్న విమానంలోకి అనుమతించే ప్రసక్తే లేదని తెలిపింది. అయితే చైనా ఇంత సడన్ గా చైనీయులను స్వదేశానికి వచ్చేయాలని పిలుపు ఇవ్వడం పట్ల ఏదో కుట్ర ఉంది అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా భారత్ చైనా లద్దాఖ్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ప్రకటన జారీ చేయడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది.

 

ఇండియా తో యుద్ధానికి చైనా రెడీ అవుతున్నట్లు చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్ల ఇటీవల చైనా మనిషి లేని హెలికాప్టర్ ద్వారా ఇండియా - చైనా సరిహద్దు ల మధ్య సర్వేలెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నట్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కూడా భారత ప్రభుత్వం గుర్తించింది. మొత్తంమీద కరోనా వైరస్ ద్వారా ప్రపంచాన్ని షేక్ చేసిన చైనా త్వరలో ఇండియా తో యుద్ధం చేయటానికి కుట్ర పన్నుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క మాత్రం ఇండియాలో ఉన్న కొద్ది వైరస్ వ్యాప్తి చెందడంతో చైనా తమ దేశానికి చెందిన వాళ్లని వెనక్కి వచ్చేయమని అంటున్నారని మరి కొంతమంది అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: