ప్రస్తుత రోజుల్లో సమాజం ఎలా మారిపోయింది అంటే కన్నతల్లి చనిపోతే భౌతికకాయాన్ని ఇంట్లోకి కూడా రానివ్వకుండా అడ్డుపడే రోజులు వచ్చేశాయి. ఆస్తి తన పేరిట రాసి ఇవ్వలేదు అన్న కోపంతో  ఈ దారుణానికి ఒడిగట్టాడు దుర్మార్గుడు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఎందుకైనా కనికరం కూడా చూపలేదు ఆ ప్రబుద్ధుడు. ఈ దారుణమైన సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. 


ఇక ఈ విషయంలో పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళగిరిలోని ఇందిరా నగర్ కు చెందిన సత్యనారాయణ - లక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు జరిపించారు. కొడుకు మల్లేశ్వరరావు మాత్రం మద్యానికి బానిస ఆస్తి కోసం తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడేవాడు. ఆస్తి తన పేరుమీద రాయాలని వారిపై ఒత్తిడి చేసేవాడు ఏం చేయాలో తెలియని ఆ తల్లిదండ్రులు కుమారుడు నుంచి వాళ్ళకి ప్రాణహాని ఉందని రెండు సంవత్సరాల కిందట పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇలా చేయడంతో కొద్దిరోజులకు ఆ గొడవ సద్దుమణిగింది అనే చెప్పాలి. 


ఇలా ఉండగా ఇటీవలే తండ్రి నాగమల్లేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందాడు. తన తండ్రి చనిపోయాడు అనే బాధ కూడా లేకుండా ఆస్తి కోసం పంచాయతీ పెట్టాడు ఆ నీచుడు. బతికున్న సమయంలో తండ్రిని సరిగ్గా చూసుకో లేదు కాని అలాంటి వ్యక్తికి ఆస్తి ఎందుకు అని అతని సోదరుడు అడగడం జరిగింది. దీనితో మళ్లీ ఆస్తి విషయంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇక బంధువులు అందరూ కలిసి సర్దిచెప్పడంతో వివాదం అప్పటికి ముగిసిపోయింది. అయిన కూడా ఆస్తి పై ఆశ చంపుకొని మల్లేశ్వరరావు తల్లి అడ్డు లేకపోతే ఆస్తి తనకు దక్కుతుందని అనుకున్నాడు. దీనితో తల్లి లక్ష్మిని వేధించడం మొదలు పెట్టాడు. 


తల్లిని ఇంట్లోనే ఉంచి తలుపులు వేసి నిర్బంధించడం జరిగింది. ఇల్లు, పొలం నా పేరు తో రాయకపోతే చంపేస్తాను అంటూ తల్లిని బెదిరించాడు కూడా. కొడుకు వేధింపులు ఆ తల్లి భరించలేక వెనుకవైపు ఉన్న తలుపుల ద్వారా బయటికి వెళ్లి ఇక ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీస్ అధికారులను సంప్రదించి తన కొడుకు పై ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కొడుకు దగ్గరకు వెళ్ళకుండా బాపట్లలోని కూతురు వద్దనే ఉంటూ జీవనం కొనసాగిస్తుంది. కానీ తాజాగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఇక లాక్ డౌన్ కారణంగా తో కూతురు, భర్త విజయనగరంలోనే ఉండిపోవడం జరిగింది. దీంతో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మంగళగిరిలోని ఇంటికి వెళ్లడం జరిగింది. కానీ అక్కడ కొడుకు తల్లి శవాన్నిఇంట్లోకి రాణించేందుకు ఒప్పుకోలేదు. స్థానికులు బంధువులు ఎంత నచ్చజెప్పినా కూడా వినలేదు. ఆ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: