హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం అయ్యాయి. 
వాహనాలు నడిపే వారికి చలాన్లు కొత్తకాదు. ఇది నిన్నటి మాట... ఇప్పుడు సీన్ మారింది... చలాన్ పేరు వింటే మండే ఎండలోనూ ఇంకా హీట్ పెరిగిపోయేలా ఉంది. కారణం... ఆ చలాన్లు ఇస్తున్న షాకే . లాక్ డౌన్ రూల్స్  సడలించడంతో.. రోడ్లపై రివ్వు రివ్వున దూసుకొచ్చే స్పీడ్ బాబులకు ... గుబగుయ్ మనేలా చలాన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

 

లాక్ డౌన్ సడలింపుతో వాహనదారుల్లో కష్టాలు మొదలయ్యాయి.. సుమారు రెండు నెలల పాటు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ రోడ్లు, ట్రాఫిక్ తో తిరిగి కిటకిటలాడుతున్నాయి. లాక్ డౌన్ లో నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చిన వారికి చలాన్ల రూపంలో భారీ షాక్ తగులుతోంది.  రెండు నెలల్లో సుమారు 21లక్షల రూపాయలు చలాన్ల విధించారు.

 

హైదరాబాద్ లో లాక్ సడలించిన పోలీసులు.. ట్రాఫిక్  రూల్స్ ను బ్రేక్ చేసే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గ్రేటర్ లో ఇప్పటికే సుమారు 21 లక్షల కేసులు నమోదు చేసింది ట్రాఫిక్ శాఖ.  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్, ఇతర ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వాహనదారులకు చలాన్లు విధించింది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపారంటూ.. 10 లక్షల 90 వేల మంది పై కేసులు నమోదయ్యాయి. సుమారు 14 కోట్ల రూపాయల జరిమానా విధించారు.  పిలియన్ రైడర్ హెల్మెట్ లేని కేసులు 2 లక్షల 77 వేలు నమోదయ్యాయి. సైడ్ మిర్రర్ లేని కేసులు లక్షా 6 వేల కేసులు ఫైల్ అయ్యాయి. 

 

సైడ్ మిర్రర్, పిలియన్ రైడర్ హెల్మెట్ లేని కేసులు ఎక్కువ సంఖ్యలో రిజిస్టర్ చేశారు.. అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ లో ఈ కేసులు నమోదయ్యాయి.. లాక్ డౌన్ పీరియడ్ లో రోడ్ల పైకి వచ్చిన వాహనదారుల పై ఎంవీ యాక్ట్ కింద చలానాలు విధించారు. ఇవి కొత్తగా ఉన్న రూల్స్ కావని.. నిబంధనల ప్రకారమే ఈ కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: