విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. కరోనా వైరస్ లాక్ డౌన్ టైం లో ప్రజలంతా ఇంటికే పరిమితం అయినా సమయంలో తెల్లవారుజామున ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువులు లీక్ అవ్వడం జరిగింది. దీంతో ఆ కంపెనీ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు నిద్రలో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక స్పృహతప్పి పడిపోయి ఊపిరి తీసుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవటం మనకందరికీ తెలిసిందే. దాదాపు కంపెనీ చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల మేరకు వ్యాపించిన ఈ ప్రమాదకరమైన గ్యాస్ వల్ల మనుషులు మాత్రమే కాదు పశువులు మరియు చెట్లు, పంట పొలాలు కొన్ని వందల ఎకరాలు నాశనమయ్యాయి. 

 

గ్యాస్ లీకేజ్ అయిన సమయంలో చనిపోయిన కుటుంబాలకు అదేవిధంగా అనారోగ్యం పాలైన వారికి నష్ట పరిహారం అందించిన ప్రభుత్వం, లీక్ అయినా గ్యాస్ వల్ల పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోక పోవడం పట్ల తాజాగా  విమర్శలు వస్తున్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ వినబడుతోంది. ఇటీవల ప్రభుత్వ అధికారులు కంపెనీ చుట్టూ ప్రక్కల ఉన్న పంట పొలాలు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ సూచించడం జరిగింది. ఈ నిర్ణయం తో దాదాపు 400 మంది రైతులు కూరగాయలు పంట వేసి నష్టపోయారు. లక్షల రూపాయలను నష్టపోయినట్లుగా  రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

అప్పట్లో జగన్ బాధితుల తో మాట్లాడిన సమయంలో పశువులు కోల్పోయిన వారు పంటపొలాలు నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే  దానికి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కంపెనీ అయినా లేకపోతే ప్రభుత్వమైనా కచ్చితంగా రైతులకు న్యాయం చెయ్యాలనే  డిమాండ్ గట్టిగా వినబడుతోంది. పైగా చేతికి వచ్చిన పంట కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. దీంతో హాస్పిటల్ పాలైన వారికి మరియు చనిపోయిన మృతులకు నష్టపరిహారం చెల్లించిన జగన్ సర్కార్ రైతులకు కూడా న్యాయం చేయాలని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. లేకపోతే ఈ విషయంలో రైతుల తరపున హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: