ప్రపంచంలో కరోనా వైరస్ ఉన్న కొద్ది బలపడుతోంది. ఇప్పటివరకు వైరస్ కి మందు మరియు వ్యాక్సిన్ లేకపోవటంతో లాక్ డౌన్ విధించిన దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. కాగా వైరస్ నుండి  బయట పడ్డాము అని అనుకుంటున్న దేశాల్లో ఇటీవల మళ్లీ వైరస్ విజృంభించడంతో లాక్ డౌన్ అమలు చేయటానికి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇండియాలో లాక్ డౌన్ ఎన్ని అమలుచేస్తున్న గాని వైరస్ కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి కనబడటం లేదు. ముఖ్యంగా వలస కూలీలు వలన దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందిందని వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

 

ఎప్పుడైతే వలసకూలీ లకు అనుమతులు ఇస్తూ ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగిందో తర్వాత నుండి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య రోజుకి ఐదు వేల నుండి ఆరు వేల మధ్య నమోదవుతున్నయి. అంతకుముందు రోజుకి రెండు వేల లోపు పాజిటివ్ కేసులు బయట పడేవి. దీంతో ఇండియాలో కరోనా వైరస్ భయంకరంగా విజృంభించింది. అయితే దేశంలో అన్నిచోట్లా కరోనా వైరస్ విజృంభించి ఉన్నాగాని లక్ష్య ద్వీప్స్‌ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా బయట పడలేదు. కేరళ తీరప్రాంతం దగ్గరగా ఉండే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 64 వేల మంది జనాభా ఉంటారు. 

 

దక్షిణాది రాష్ట్రాలతో అధికంగా కనెక్ట్ అయ్యే ఈ లక్షద్వీప్ లో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా బయటపడక పోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కూడా తెలిపాడు. మరి ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కరోనా వైరస్ రాకూడదు అని అనుకుంటున్న వారు వెంటనే లక్ష్య ద్వీప్స్‌ కి వెళితే సేఫ్ జోన్ లోకి వెళ్లి పోయినట్లే. పైగా వేసవి కాలం కావడంతో లక్ష్య ద్వీప్స్‌ దగ్గర అద్భుతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని కూడా పర్యాటకులు అంటున్నారు. ఇండియాలో కరోనా వైరస్ బారి నుండి బయటపడాలి అనుకున్న వారికి లక్ష్య ద్వీప్స్‌ మాత్రమే ప్రస్తుతం శరణ్యంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: