పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్ హీరోస్ లో ఒకరు స్పైడర్ మాన్.  ఎప్పటి నుంచి ఈ స్పైడర్ మాన్ కార్టూన్లకు మంచి స్పందన్న ఉంది. స్పైడర్ మాన్ పై ఎన్నోకామిక్ పుస్తకాలు వచ్చాయి.. కార్టూన్లు వచ్చాయి.  ఇక స్పైడర్ మాన్ 1,2,3 వర్షన్లు వచ్చింది.  అయితే ఒక సాలీడు పురుగు కుట్టడం వల్ల అమాయకంగా ఉండే ఓ కుర్రాడు అసమాన రీతిలో సాహసాలు చేస్తుంటాడు. గాల్లోకి ఎగురుతూ.. రౌడీల పని పడుతుంటాడు.   ఇదంతా పుస్తకాలు, కార్టూన్లు, సినిమాల్లో కనిపించేదే.. అదే నిజ జీవితంలో జరిగితే.. తమకు స్పైడర్ మాన్ శక్తి వస్తే అన్న ఆలోచన ఓ ముగ్గురు అన్నదమ్ములకు కలిగింది. వారి వయసులు వరుసగా, 8, 10, 12. మే 14వ తేదీన ఒక ప్రమాదకర బ్లాక్ విడో సాలీడును పట్టుకుని దాన్ని ఓ కర్రతో పొడిచారు. అది ప్రతిస్పందనగా కుట్టడం ప్రారంభించింది.

 

అన్నదమ్ములు ముగ్గురూ వరుసగా దాంతో కుట్టించుకున్నారు.  కొద్ది సేపటి తర్వాత తమకు స్పైడర్ మాన్ లక్షణాలు వస్తాయని సంబరపడ్డారు.. కానీ అప్పటికే గుడ్లు తేలేశారు. దాంతో తల్లి ఆందోళనకు గురై వారిని ఆసుపత్రిలో చేర్చింది. అప్పటికే సాలీడు విషం శరీరం మొత్తం పాకడంతో వారి పరిస్థితి విషమించింది. దాంతో వారిని మరో ఆసుపత్రికి తరలించారు.  జ్వరం, వణుకు, ఒళ్లంతా చెమటలు పట్టడం, కండరాల నొప్పితో బాధపడుతున్నారు. లాపాజ్ ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి వారిని ఆరోగ్యవంతుల్ని చేశారు. మరో వారం తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు డిశ్చార్జి కానున్నారు.

 

మొత్తానికి పాజ్ ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి వారిని ఆరోగ్యవంతుల్ని చేశారు. మరో వారం తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు డిశ్చార్జి కానున్నారు. ఇక బొలీవియా ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఎపిడెమాలజీ చీఫ్ వర్జీలియో పీట్రో మాట్లాడుతూ, సినిమాల్లో చూపించేదంతా నిజం కాదని పిల్లలు తెలుసుకోవాలని తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో శ్రద్దగా గమనించి వారిని అలాంటి పనులు చేయకుండా వారించాలని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: