శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు ఎంత కష్ట పడిన ఇప్పటికీ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ గాని మరియు మందు గాని కనిపెట్టలేకపోయారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. మహమ్మారి కరోనా వైరస్ ని అడ్డుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయములో హైదరాబాదులో ఉన్న ఇంటికి ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిమితమయ్యారు. ఇదిలావుంటే ఇటీవల విమాన రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో 25 వ తారీఖున హైదరాబాద్ నుండి విజయవాడకి విమానంలో వద్దామని చంద్రబాబు టికెట్ బుక్ చేసుకున్నారు.

 

కానీ విమానాలు రాకపోకల విషయంలో ఏపీ సర్కార్ కేంద్రం విధించిన నిబంధనలు ఏర్పాట్ల విషయంలో అలసత్వం వహించడం తో 25 వ తారీఖున అన్ని విమానాలను ఏపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దీంతో రోడ్డు మార్గం ద్వారా  హైదరాబాదు నుండి అమరావతి కి చేరుకున్నారు చంద్రబాబు. అయితే ఈ సమయంలో చంద్రబాబు వస్తున్న టైములో రోడ్డు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుంపులు గుంపులుగా  ఘనస్వాగతం పలికారు.

 

వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వచ్చినట్లు ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు లాక్ డౌన్  ఉల్లంఘనపై ఎమ్మెల్సీ వి.గోపాల్ రెడ్డి హైకోర్టులో ఫిర్యాదు చేశారు. కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాస్క్ లేకుండా వ్యవహరించారన్నారు. అసలు సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంగా మరియు ప్రతిపక్ష నేతగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు అమరావతి లో అడుగుపెట్టిన 24 గంటల్లోనే జగన్ సర్కార్ ఈ విధంగా షాక్ ఇచ్చినట్లయింది. మరి ఈ ఫిర్యాదుపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: