ప్రపంచంలో ఏ మనిషి అయినా.. ఉదయం లేవగానే బ్రెష్ వేసుకున్న తర్వాత మంచి నీళ్లు మొదలు ఎన్నో రకాల తిండి పదార్థాలు తన కడుపు లో వేసుకుంటా..  ఈ మెనూలో ఏమాత్రం తేడా వచ్చినా తన జీవితం వ్యర్థం అని తాను చనిపోతానేమో అన్న భయం కూడా ఉంటుంది.  ఎక్కడో అతి కొద్ది మంది అన్నపానియాలు లేకుండా కొద్ది రోజులు ఉండగలరేమో.. కానీ యోగి ప్రహ్లాద్‌ జానీ(91) మాత్రం గత 70 ఏళ్లుగా ఆహారం, నీరు లేకుండా జీవిస్తున్నారు.  తాజాగా యోగి ప్రహ్లాద్‌ జానీ అస్తమించారు. ప్రహ్లాద్‌ జానీ అలియాస్‌ చున్నివాలా మాతాజీ గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌ జిల్లాలో తన స్వగ్రామం చారదా వద్ద మంగళవారం ఉదయం కన్నుమూశారు.  ప్రహ్లాద్‌ జానీ అంబా దేవత విశ్వాసి. ఎల్లప్పుడూ ఎర్ర చీర(చున్నీ) ధరించేవాడు.

 

స్త్రీ వలె దుస్తులు ధరించడం వల్ల అతన్ని చున్నివాలా మాతాజీ అని కూడా పిలిచేవారు. అధ్యాత్మిక అనుభవం కోసం చాలా చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టాడు. ఆయన తన 14 ఏళ్ల వయసులోనే పరమ భక్తుడిగా మారారు. అప్పటి నుంచి అన్నపానియాలు పూర్తిగా మానివేశారు. 2010లో డిఫెన్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ పరిధిలోని డిఫెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌(డిపాస్‌)తో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు, వైద్యులు యోగి జీవన విధానంపై అధ్యయనం చేశారు. ఆయన ఇలా ఎలా ఉండగలరు అన్న విషయంపై 15 రోజుల పాలు పరీక్షలు నిర్వహించారు. 

 

అయితే క్షుద్భాదలను తట్టుకునే అరుదైన శక్తి, గుణాన్ని ప్రహ్లాద్‌ జానీ కలిగిఉన్నట్లు పరీక్షల అనంతరం డీపాస్‌ ప్రకటించింది. తాజాగా మృతదేహాన్ని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయానికి సమీపంలో ఉన్న ఆశ్రయం గుహకు తరలించారు. అతని భక్తులు, అనుచరులు, విశ్వాసులు, శిష్యులు నివాళులర్పించే నిమిత్తం పార్థీవదేహాన్ని రెండు రోజుల పాటు ఆశ్రమంలో ఉంచనున్నారు. గురువారం నాడు సమాధి చేయనున్నట్లు శిష్యులు తెలిపారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: