తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి.హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ 30, 40 కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా నగరంలో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కొండాపూర్ లోని రాఘవేంద్ర నగర్ లో నివశించే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం కరోనా భారీన పడింది. నిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా నిర్ధారణ కాగా ఈరోజు అతని భార్య, కొడుకు, కోడలు, బావమరిది కరోనా భారీన పడినట్లు నిర్ధారణ అయింది. ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా సోకడంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశమైంది. 
 
వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బావమరిది వయస్సు 34 కాగా సాఫ్ట్ వేర్ భార్య వయస్సు 31 కాగా మూడేళ్ల కొడుకు, మూడున్నరేళ్ల ఇద్దరు చిన్నారి కరోనా భారీన పడ్డారు. ప్రస్తుతం ఐదుగురికి ఐసోలేషన్ వార్డులో చికిత్స జరుగుతోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో ఎక్కువ మంది కరోనా భారీన పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సి ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 66 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసులలో 31 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ముగ్గురు కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన 31 మంది కరోనా భారీన పడ్డారు. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1920కు చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 మంది డిశ్చార్జి కావడం ఊరటనిచ్చే విషయం అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: