సాధారణంగా ఎలుగు బంటిని చూస్తే గుండె గుభేల్ మంటుంది.. మరి అదే భయంకరమైన అడవి ఎలుగు ను ఓ బాలుడు చూసి ఏమాత్రం భయపడకుండా.. ఎంతో గొప్ప తెలివి తేటలు ప్రదర్శించి దాన్ని బురిడీ కొట్టింది తప్పించుకున్నాడు.  ఇటలీకి చెందిన 12 ఏండ్ల కుర్రాడు అలెశాండ్రో అడవికి వెళ్లి వస్తున్న సమయంలో  చెట్ల పొదళ్లలో నుంచి  ఓ పెద్ద ఎలుగుబంటి రావడం తటస్థించింది. అయితే అప్పటికే  అలెశాండ్రె  లైబ్రరీలో కూర్చుండి ఎలుగుబంటి అకస్మాత్తుగా వస్తే ఏంచేయాలి? ఆ సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలి? అనే పుస్తకాన్ని చదువుతున్నాడు. అయితే ఆ పుస్తకం చదివిన సమయంలో నిజంగా తనకు అలాంటి అనుభవం ఒకటి ఎదురువుతుందని అస్సలు భావించలేదు. కానీ అలాంటి పరిస్థితి అలెశాండ్రె కి నిజ జీవితంలో ఎదురైంది.. కానీ అతడు ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. 

 

 తన వెనుక అంత పెద్ద ఎలుగు వస్తున్నా  వెంటనే తాను చదివిన పుస్తకంలో మాదిరిగా ఓ ప్రొఫెషనల్‌గా మెల్లగా నడుస్తూ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా నడుస్తూ వచ్చాడు. పిల్లాడిపై ఎలుగుబంటి దాడిచేయడం ఖాయం అనుకొంటుండగా.. కొద్ది దూరం అలాగే వెంబడించిన ఆ ఎలుగుబంటి.. కొద్దిసేపటి తర్వాత తన దిశ మార్చుకొని మరోవైపు వెళ్లిపోయింది. అయితే తాను ఎప్పుడో చదివిన పుస్తకంలోని మ్యాటర్ ఇప్పుడు ఆ బాలుడి ప్రాణాలు కాపాడాయని.. నిజంగా ఇదో అద్భుత ఘట్టం అన్నారు.

 

అంతే కాదు ఆ విడియో తీస్తున్నంత సేపు చేతులు వణికి పోయాయని.. ఎలా దాడి చేస్తుందో అన్న భయం ఉన్నదని అన్నారు వీడియో గ్రాఫర్.   అలెశాండ్రో ధైర్యంగా నడుచుకుంటూ వచ్చిన ఆ సమయంలో తానే సాక్షిగా ఉన్నానని, ఈ వీడియోను ఇటలీలోని ప్రసిద్ధ హైకింగ్‌ స్పాట్‌ అయిన స్పోర్మినోర్‌ వద్ద తీసినట్లు లోరిస్‌ కాలియారి చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: