సాధారణంగా మన దేశంలో పుట్టిన వాళ్లల్లో మెజారిటీ శాతం భారత్ లో పుట్టినందుకు గర్వంగా భావిస్తూ దేశభక్తిని చాటుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం మన దేశాన్ని ఇతర దేశాలతో పోల్చుతూ విమర్శలు చేస్తూ ఉంటారు. రోడ్ల విషయంలోను, ట్రాఫిక్ విషయంలోను ఎక్కువగా ఇతర దేశాలతో పోలుస్తూ విమర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. మన విద్యా వ్యవస్థలోని కొన్ని లోపాల వల్లే మన ఆలోచనా తీరు ఈ విధంగా ఉంది. 
 
మన దేశంలోని మంచి గురించి, మన దేశం గొప్పదనం గురించి విద్యా వ్యవస్థలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఈ తరహా ఆలోచనా ధోరణికి కారణమవుతోంది. మన దేశంలో శతాబ్దాల క్రితమే టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే అద్భుతమైన కట్టడాలు, ప్రాజెక్టులు నిర్మించినా వాటికి సంబంధించిన సమాచారం నేటి తరం యువతకు తెలియడం లేదు. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన సమయంలో జరిగిన దోపిడీ గురించి పాఠ్యాంశాల్లో ఎటువంటి సమాచారం లేదు. 
 
200 సంవత్సరాలు భారత్ ను పాలించిన బ్రిటిష్ వారు భారత్ విలువైన ఆస్తులను దోచుకుపోయారనేది వాస్తవం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో భారత్ ను బ్రిటన్ ఏ విధంగా దోచేసిందో స్వయంగా ఆయన లెక్కల్లోనే చెప్పారు. క్రీస్తు శకం 1700 సంవత్సరంలో 22.6 శాతం సంపద భారత్ లో ఉండేదని... అప్పటి భారత్ సంపద యూరోపియన్ దేశాల సంపద మొత్తానికి సమానమని తెలిపారు. 
 
కానీ 22.6 శాతం సంపద 1952 సంవత్సరానికి 3.8 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం తలసరి ఆదాయం విషయంలో భారత్ అత్యంత పేద దేశంగా మారింది. 1757 నుంచి 1947 ఆంగ్లేయుల వల్ల భారత్ కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం 30 ట్రిలియన్ డాలర్లు. కేవలం ఒక్క ఢిల్లీ నుంచే 173 మిలియన్ డాలర్ల దోపీడీ జరిగిందని తెలుస్తోంది. ఆ కాలంలో విదేశీ మద్యం, విదేశీ అమ్మాయిలను రాజులకు ఎర వేసి మన దేశంలో బ్రిటిష్ వారు వ్యాపారం ప్రారంభించారు. ఆ తరువాత రాజుల మధ్య కలహాలు బ్రిటిష్ వారు భారత్ ను ఆక్రమించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: