ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని సంఘటనలు అయితే అసలు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో  కూడా అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులకు   వారి లేని లోటు మిగిల్చి వెళ్తున్నారు. అనుమానాస్పద పరిస్థితిలో వైద్య విద్యార్థిని చనిపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆ యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 

 


 పూర్తి వివరాల్లోకి వెళితే ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న సాహితీ తల్లిదండ్రులతో కలిసి ఎల్బీనగర్లో అలేఖ్య టవర్స్ లో నివాసం ఉంటున్నారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంతో ఇంటికే పరిమితం అయిన సాహితి అనుకోకుండా ఈ రోజు ఉదయం అపార్ట్మెంట్ పై నుంచి దూకి వేయడం జరిగింది. 14వ ఆర్ అంతస్తు బాల్కనీ నుంచి ఆ విద్యార్థి దూకి వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చేతికొచ్చిన కూతురు ఇలా ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు. అయ్యారు. ఆ తల్లిదండ్రులు కన్న కూతురి మృతదేహాన్ని చూసి తల్లడిల్లి పోవడం జరిగింది.

 

ఇక ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సాహితీ మృతదేహాన్ని పరిశీలించడం.  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక బాల్కనీ లో ఉన్న గ్రిల్స్ తొలగించి ఉండడంతో సాహితీ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇక గ్రిల్స్ సాహితీనే  తొలగించి దూకేసి చనిపోవడానికి ప్రయాత్నిచిందా లేక ఎవరైనా హత్య చేశారా అన్న విషయంపై పోలీస్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో పోలీస్ అధికారులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: