ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకు వచ్చిన సరికొత్త రూల్స్ విమాన ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మే 25వ తారీకు నుండి దేశీయంగా విమాన సర్వీసులను ప్రారంభించడానికి ఓకే చేయటం అందరికీ తెలుసు. అయితే ఆ సమయంలో ఏపీలో మాత్రం కొత్త రూల్స్ కి ఏర్పాట్లకు టైం ఇవ్వాలని ఒక రోజు వాయిదా వేస్తూ 26వ తారీకు నుండి విమానాల రాకపోకలను స్టార్ట్ చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు వలన విమాన ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విమాన ప్రయాణికులు ఎవరైనా సరే కచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే స్పందన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే విమాన ప్రయాణం చేయాల్సిన అనుమతి ఉంటుందని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

దీంతో స్పందన రూల్ అవగాహన లేక టికెట్లు బుక్ చేసుకున్న వారంతా ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఏమూల  ప్రాంతానికి చెందిన వారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టాలనుకునే మాత్రం ముందుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు స్పందన వెబ్ సైట్ ద్వారా ఈ పాస్ జనరేట్ చేసుకోవాలని ఆ తర్వాత మాత్రమే ఏపీలో అడుగు పెట్టాల్సి ఉంటుంది అంటూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఐదు రోజులు గడుస్తున్నా స్పందన వెబ్సైట్ నుండి ఎటువంటి స్పందన రావడం లేదని విసుగు చెందుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాల ద్వారా అడుగుపెట్టాలంటే దండం పెట్టే పరిస్థితి ప్రయాణికుడికి ఏర్పడింది.

 

దరఖాస్తు చేసుకుని వెయిట్ చేసే బదులు రోడ్డు మార్గం ద్వారా ఏపీ లోకి రావడం బెటర్ అని ప్రయాణికులు అంటున్నారు. ఇంకా రోడ్ చూస్తే ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వెళ్లే వెహికల్ నెంబర్ కూడా ముందే వెబ్సైట్ లో పొందుపరచాలని చెప్పటం ప్రయాణికులకు మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇటువంటి నిర్ణయాలు ఏ రాష్ట్రంలో లేవని చాలా మంది విమాన ప్రయాణికులు ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: