టీవీ5.. తెలుగుదేశం అనుకూల ఛానళ్ల జాబితాలో ప్రముఖంగా ఉండే చానల్. ఈ ఛానళ్లో వచ్చే కథనాలు, ఇంటర్వ్యూలు, డిబేట్లు అన్నీ తెలుగు దేశం కు అనుకూలంగానా.. వైసీపీకి వ్యతిరేకంగానూ ఉంటాయని మీడియా సర్కిళ్లో జోరుగా ప్రచారం ఉంది. అందులోనీ ఈ ఛానల్ కు మూర్తి వచ్చాక ఇంకాస్త జోరు పెరిగింది. వైసీపీ వ్యతిరేక చర్చలు మరింతగా జోరందుకున్నాయి.

 

 

ఈ నేపథ్యంలో ఇటీవల టీవీ5 యాంకర్ మూర్తిని అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంకేముంది అరెస్టే తరువాయి అన్నట్టు గా మూర్తి అనుచరులు ప్రచారం చేశారు. కానీ అది వాస్తవం కాలేదు. తన పై ఏ కేసూ పెట్టలేదని మూర్తి నేరుగా తన టీవీ చానళ్లోనే వివరణ ఇచ్చారు. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో తాజాగా మరో ఇష్యూ ముందుకొచ్చింది. అదేంటంటే.. ఈ ఛానల్ సర్కారుకు చెందిన ఓ రహస్య డాక్యుమెంట్ ను తన చానళ్లో ప్రసారం చేసిందన్నది అభియోగం.

 

 

ఈ మేరకు ఓ రహస్య డాక్యుమెంట్ ను టీవీ5 దొంగింలించడమో.. ఫోర్జరీ చేయడమో జరిగిందని.. దీనిపై విచారణ జరపాలని కోరుతూ.. ఉన్నత విద్యాశాఖ అధికారి సతీష్ చంద్ర ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ వన్ గా శ్రావణ్ కుమార్ అనే లాయర్‌.... 2గా టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు.. 3గా ప్రజంటర్ మూర్తి ఉన్నారు. జగన్ సర్కారు కొన్నాళ్ల క్రితం మీడియాపై కేసులు పెట్టేందుకు అధికారులకు అవకాశం కల్పిస్తూ తెచ్చిన జీవో ప్రకారం కేసులు పెట్టారు.

 

 

మొత్తం మీద ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీవీ5 లో అరెస్టులు ఖాయమన్న భావన మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి జగన్ సర్కారు కేసులతోనే బెదిరించి వదిలేస్తుందా.. లేక.. అరెస్టుల వరకూ వెళ్తుందా అన్న సంగతి తేలాల్సి ఉంది. ఇటీవల ఈ ఛానల్ లో మరో న్యూస్ ప్రజంటర్ సాంబశివరావును కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగింది. మొత్తానికి జగన్ సర్కారు టీవీ5 ను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: