తన యజమానురాలి మీద అత్యాచారం జరిగిన కేసులో ఆమె పెంచుకుంటున్న చిలుక సాక్ష్యం చెప్పడానికి సిద్ధం అయింది. అమెరికాలోని అర్జెంటీనాలో చోటు చేసుకుంది ఈ సంఘటన.   2018 డిసెండర్‌లో ఓ రోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్యచేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి ‘ప్లీజ్‌, నన్ను వదిలేయండి’ అంటూ అర్థిస్తున్న శబ్ధాలు వినిపించాయి. ఆ అరుపులు నగ్నంగా, విగతజీవిగా పడి ఉన్న మహిళ శవం పక్కన బోనులో ఉన్న చిలుక పలుకులు వినిపించాయి. నిందితులు, మహిళను అత్యాచారం చేస్తున్నప్పుడు ఆమె ఆ దుర్మార్గులను నుంచి తప్పంచుకోవడానికి వేడుకుంది.. ఆ  ఆర్తనాదాలను చిలుక గ్రహించి వాటినే పలుకుతోందని పోలీసులు గ్రహించారు. 

 

ఈ ఘటన కన్నా ముందు నిందితులు ఇంట్లోకి చొరబడిన వెంటనే చిలుక ‘నన్ను ఎందుకు కొడుతున్నారు?’ అంటూ యజమాని మాటలను తిరిగి పలికింది. ఇరుగుపొరుగు వారు కూడా ఈ మాటలను తాము చెవులారా విన్నామని తెలిపారు.  అమెరికాలోని అర్జెంటీనాలో చోటు చేసుకుంది ఈ సంఘటన. సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజబెత్ టోలెడొ అనే మహిళ నివాసం ఉంటున్న ఇంటిపై భాగంలో ముగ్గురు వ్యక్తులు బండారం బయట పెట్టేందుకు ఇప్పుడు చిట్టి చిలుకు సిద్దమైంది. ఈ కేసులో చిక్కుముడి వీడాలంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న చిలుక పలుకులను సాక్ష్యంగా చేర్చారు పోలీసులు. 

 

మరోవైపు పోస్టుమార్టంలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే కేసు విచారణకు రానుండగా చిలకను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు సంబంధించిన దారుణానికి సంబంధించి పూర్తి మాటలు తెలిసి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, ఇప్పుడు నిందితులకు శిక్ష వేయడంలో చిలుక కీలకంగా మారింది.  మరి ఈ చిలుక సాక్ష్యం ఎంత వరకు చెల్లుతుంది.. ఆ నింధితులకు తగిన శిక్ష పడుతుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: