చట్టాలు తెచ్చిన ఎన్ని శిక్షలు విధించిన గాని సమాజంలో మార్పు అనేది రావడం లేదు. ఆడవాళ్లపై అత్యాచారాలు ఆగడం లేదు. అయితే తాజాగా ఒక ఘటన వెలుగులో వచ్చింది. ఆ ఘటనకు సాక్ష్యం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.మనిషి అయితే కాదండోయ్.. మనం సరదాగా పెంచుకునే  చిలుక.  చిలుకలు మాట్లాడితే  ఎంతో అందంగా ఉంటుంది. చాలామంది వాటితో మాటలు మాట్లాడించి ఆడుకుంటూ ఉంటారు.

 

 

జాతకం చెప్పాలన్న గాని చిలుకతో చెప్పిచుకుంటారు చాలా మంది.. అయితే ఇప్పుడు తాజాగా ఓ అత్యాచార కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా మారనుంది. యజమానురాలి చివరి మాటలను నోటి వెంటపలుకుతూ ఆమె చావుకు కారణమైన వారిని కటకటాల వెనక్కు నెట్టనుంది వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలోని సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజబెత్ టోలెడొ అనే మహిళ ఇంటిపైన ముగ్గురు వ్యక్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్దరు ఇంటి ఓనర్‌పైనే కన్నేశారు.ఈ క్రమంలో 2018 డిసెంబర్‌లో ఓ ఆరోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. విషయం తెలుసుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా వారికి ‘‘ ప్లీజ్... నన్ను వదిలేయండి’’ అంటూ అర్ధిస్తున్న శబ్ధాలు వినిపించాయి. ఎవరా అని వెళ్లి చూడగా ఒక చిలుక.  పోలీసులు ఆ మాటలు వినిపిస్తున్న వైపు చూడగా.. నగ్నంగా, నిర్జీవంగా పడివున్న ఓ మహిళ మృతదేహం పక్కన బోనులో ఉన్న చిలుక పలుకులు వినిపించాయి.

 

బాధితురాలిని హింసిస్తూ, అత్యాచారం చేసినప్పుడు ఆమె దుండగలను వేడుకున్న మాటలను చిలుక గ్రహించి వాటినే ఉచ్ఛరించినట్లు పోలీసులు భావిస్తున్నారు....ఇక ఈ ఘటన కంటే ముందే నిందితులు ఇంట్లోకి చొరబడిన వెంటనే చిలుక ‘‘ నన్ను ఎందుకు కొడుతున్నారు’’ అంటూ మృతురాలి మృతురాలి మాటలను తిరిగి పలికింది. ఈ మాటలను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు.దీంతో ఈ హత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా మారింది. ఇదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ సాగుతుంది..అయితే చిలక పలుకులు నిజమే అని తేలుతుంది.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హత్యాచారం చేసి చంపినట్లు తేలింది... !!

మరింత సమాచారం తెలుసుకోండి: