వైయస్ జగన్ పార్టీలో మొదటి నుండి పార్టీకి తలనొప్పిగా వ్యవహరిస్తున్న నాయకుడిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వార్తల్లో నిలవడం మనకందరికీ తెలిసిందే. జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యావిధానం ఐడియా పై పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అప్పట్లో వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా బిజెపి పార్టీ పెద్దల కు భారీ ఎత్తున విందు ఇచ్చి జాతీయస్థాయిలో తన రేంజ్ ఏంటో చూపించడం జరిగింది. అయితే ఆ తర్వాత జగన్ కి మరియు రామకృష్ణంరాజు కి మధ్య గ్యాప్ వచ్చిందని ఆంధ్ర లో ఉన్న మీడియా కుప్పలుతెప్పలుగా వార్తలు ప్రచారం చేయడంతో వెంటనే జగన్ తో మీటింగ్ అయ్యి రఘురామకృష్ణంరాజు అటువంటిదేమీ లేదని మొన్న ఖండించారు.

 

ఇదిలా ఉండగా ఇటీవల ఓ జాతీయ చానల్ లో పార్టీ తరఫున పాల్గొన్న రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మద్యం గురించి మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడం వల్ల గాని మద్యం షాపులు తగ్గించినందువల్లో...మందుబాబులు తాగటం మానేస్తారు అని నేను అనుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అవసరమైతే మందుబాబులు మందు కోసం రెండు కిలోమీటర్లు ఎక్కువ దూరం పోవటానికి కూడా వెనుకాడని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అదే విధంగా మతాల గురుంచి కూడా ఇష్టానుసారమైనా వ్యాఖ్యలు చేశారు.  

 

ఎవరైనా మద్యపానం నిషేధం చెయ్యాలనుకుంటే డైరెక్టుగా మద్యపానం నిషేధం అమలు చేయాలని ఈ విధంగా విడతలవారీగా పెట్టడం వల్ల రిజల్ట్ ఏమీ ఉండదని  వ్యాఖ్యానించారు. దీంతో వైసిపి పార్టీ సొంత ఎంపీ యే మద్యపానం నిషేధం గురించి ఈవిధంగా మాట్లాడటం పై ప్రతిపక్షాలు వైసిపి పార్టీ పై సెటైర్లు వేస్తున్నాయి. మద్యం రేట్లు పెంచి షాపులు తగ్గించి మీకు మీరే కరెంట్ షాక్ లు కోట్టించుకుంటున్నారుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క రఘురామకృష్ణం రాజు ని పార్టీలో నుండి పంపేస్తేనే బెటర్ అని వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: