జగన్ అసలు ముఖ్యమంత్రి కారని అంతా అనుకున్నారు. వారంతా కూడా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు. జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతారో చూస్తానని ఒక నేత సవాల్ కూడా చేశాడు. ఇక నాటి నుంచి జగన్ సీఎం అయినా కూడా ఆయన చేసిన మంచి పనులను మెచ్చుకోవడానికి కూడా విపక్ష నేతల్లో కొందరిని మనసు అసలు రావడంలేదు.

 

ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఏడాది పాలన ఎలా ఉంది అంటే టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో అందరికీ తెలిసిందే. నవ రత్నాలు నవ మోసాలు అన్నారు మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు. జగన్ కి ఏమీ తెలియదు అని ఇప్పటికీ అంటున్నారు చంద్రబాబు. ఇక జగన్ పాలన వైఎస్సార్, బాబులతో పోల్చి చూస్తే పదవ వంతు కూడా ఏమీ చేయలేదని కామ్రెడ్ నారాయణ అంటున్నారు. 

 

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని ఇదే విషయం మీడియా అడిగితే సమయం వచ్చినపుడు దాని మీద మాట్లాడుతాను అంటున్నారు. నిజంగా ఏడాది పాలన అంటే ఇదే కదా సమీక్షకు సమయం. ఒక ప్రభుత్వం పనితీరు కొలమానం చూడడానికి ఇదే కదా టైం. కానీ గంటా మాత్రం సమయం వచ్చినపుడే స్పందిస్తాను అంటున్నారు. 

 

మరి జగన్ పాలన బాగుందని అంటారా. లేక బాగులేదు అంటారా. ఏమంటారో ఈ సీనియర్ మాజీ మంత్రువర్యులు అని అంతా ఆసక్తిని  చూపిస్తున్నారు. ఇక గంటా మరో మాట కూడా అంటున్నారు. దేవుడి భూములు అమ్మడం మంచిది కాదు  అని. అది టీటీడీ భూముల వేలం రచ్చ మీదనే అనుకోవాలేమో.  

 

అయితే గంటా మరో మాట కూడా అన్నారు. ఏ ప్రభుత్వం భూములు అమ్మినా తప్పే అని, అంటే గత టీడీపీని కూడా ఆయన తప్పుపట్టారనుకోవాలేమో. ఏది ఏమైనా రాజకీయ వ్యూహకర్తగా పేరుగడించిన గంటా తన మనసులోని భావాలను అంత తొందరగా బయటపెట్టారు. ఆయన ఎపుడైనా బయటపెడితే మాత్రం అది సంచలనమే అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: