ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా పేరు చెబితే ఎంతగా భయపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ మహ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండు నెల‌లుగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి.  అయితే కరోనాని కట్టడి చేయడానికి ముఖ్యంగా శానిటైజేషన్, మాస్క్, భౌతిక దూరం తప్పని సరిపరిస్థితి అయ్యింది.ముఖ్యంగా శానిటైజర్ విషయంలో చిన్న నుండి పెద్ద వరకు తప్పని సరి అయ్యింది.  ఎక్కడి వెళ్లినా తమ వెంట శానిటైజేషన్ తప్పని సరి అయ్యింది.  అయితే ఇది రక రకాలుగా లభిస్తున్న విషయం తెసిందే.  గతంలో వీటి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం శానిటైజర్లు దిన చర్యలో భాగంగా మారింది.  శానిటైజర్లు ప్రతి ఇంటిలో తప్పని సరిగా వాడుతున్నారు. 

 

 

స‌బ్బు లేదా హ్యాండ్ శానిటైజ‌ర్ల‌తో చేతుల‌ను శుభ్రం చేసుకోవాల‌ని సూచించాయి. దీంతో ప్ర‌పంచంలో ఎక్క‌డ చూసినా హ్యాండ్ శానిటైజ‌ర్ ఒక నిత్యావ‌స‌రంగా మారిపోయింది. పొర‌పాటున కూడా సూర్య‌ర‌శ్మి, వేడి అధికంగా ఉండే ప్ర‌దేశాల్లో హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను పెట్ట‌కూడ‌ద‌ని వారు సూచిస్తున్నారు. శానిటైజ‌ర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్క‌హాల్‌తో త‌యార‌య్యే ఈ హ్యాండ్ శానిటైజ‌ర్ల‌కు స‌హ‌జంగానే మండే స్వ‌భావం ఉంటుందని.. కార్లు, ఇత‌ర వాహ‌నాల్లో శానిటైజ‌ర్లను వ‌దిలి వెళ్ల‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అగ్నిమాప‌క అధికారులు చెబుతున్నారు. 

 

 అయితే శానిటైజర్ ఎక్కడ పడితే అక్కడ వాడటం కూడా మంచిది కాదని అంటున్నారు.  వాహ‌నం ఎక్కువ సేపు ఎండ‌లో ఉంటే బాగా వేడ‌క్కెతుంద‌ని, అలాంట‌ప్పుడు అందులో హ్యాండ్ శానిటైజ‌ర్ ఉంటే వేడికి మండిపోయి వాహ‌నం మొత్తం త‌గుల‌బ‌డే ప్ర‌మాదం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.  అందుకే శానిటైజర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని అధికారులు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: