టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అసలు అధికారం లేకపోతే ఉండలేని గంటా..సంవత్సరం నుంచి ప్రతిపక్షంలోనే ఉంటున్నారు. అయితే మధ్య మధ్యలో పార్టీ మారిపోతారని వార్తలు వచ్చినా సరే, ఆయన పార్టీ మారకుండా అలాగే ఉన్నారు. అలా అని టీడీపీలో కూడా యాక్టివ్ గా కనిపించలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో పెద్దగా ఏపీ రాజకీయాల్లో అడ్రెస్ లేరు. కానీ ఆయన చుట్టూ మాత్రం రాజకీయం నడిచింది.

 

పార్టీ మార్పుపై, టీడీపీలో యాక్టివ్‌గా ఉండకపోవడంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్, గంటాని వైసీపీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని పలుమార్లు చెప్పారు. అయితే గంటా కూడా పార్టీ మారకుండా టీడీపీలోనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు వచ్చి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇక తాజాగా కూడా తన నియోజకవర్గంలో కాస్త హడావిడి చేయడం మొదలుపెట్టారు. మహానాడు కార్యక్రమం ఉండటంతో, పార్టీలో యాక్టివ్ అయ్యారు.

 

అలాగే తన నియోజకవర్గంలో 42 వార్డులో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంచారు. ఇదే సమయంలో మంత్రి అవంతి కూడా ఉత్తర నియోజకవర్గంలో పర్యటించి 49 వార్డులో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంటాని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనిపించడం లేదని, హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీ మార్చే ఎమ్మెల్యే గంటా, చంద్రబాబు లిద్దరూ రాజకీయ వ్యాపారులని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

అయితే ఎప్పుడు ఎలా ఉంటారో అర్ధం కాకుండా గంటా రాజకీయాలు చేస్తుంటే, అవంతి సెట్ కాని డైలాగులు వేస్తున్నారని విశ్లేషుకులు అంటున్నారు. గంటా ఎక్కడా తమ పార్టీలోకి వచ్చేస్తారో అని అవంతి భయపడుతున్నట్లున్నారని, అందుకే అలా విమర్శలు చేస్తున్నారని, కాని గంటా పార్టీలు మారితే, అవంతి కూడా చాలానే పార్టీలు మార్చారని చెబుతున్నారు. అవంతి...ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ ఇప్పుడు వైసీపీలో ఉన్నవిషయాన్ని గుర్తుచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: