ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు బాగా పెరిగిపోతున్నాయి. ఇటీవల సెల్ ఫోన్ బ్యాలెన్స్ చేయించలేదు అని కోపంతో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ లో చోటు చేసుకోవడం జరిగింది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... భూపాల్ కు చెందిన ఒక యువకుడు కొద్దిరోజులుగా సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించాలని తల్లిదండ్రులు అడగడం జరిగింది. ఇక తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు మనస్థాపానికి గురి అవ్వడం జరిగింది.  దీనితో ఆవేశంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చి వెళ్ళిపోయాడు. ఈ చిన్న విషయానికి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం ఆ తల్లిదండ్రులకు పెద్ద షాక్ నే ఇచ్చింది.

 


ఈ సంఘటన విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా బాగ్సేవానియా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ తెలిపిన వివరాల ప్రకారం.. నెట్ బ్యాలెన్స్ వేయించాలని ఆ యువకుడు తన తల్లిని చాలా సార్లు అడిగినా కూడా ఆమె వేయించుకోపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలతో నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం చాలా దారుణం అనే చెప్పాలి. దీనివల్ల కుటుంబ సభ్యులు ఎంత నష్ట పోతారు అన్న విషయం ఒకసారి గ్రహిస్తే ఇలాంటి ఆలోచనలు మనుకుంటారు. యువత ఒకసారి తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారు అని ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు చాలా వరకు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: