ప్రస్తుత దినాలలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. తెలివైన వారు మంచి కోసం ఉపయోగిస్తుంటే, ఆకతాయిలు మరియు అపరిచితులు సోషల్ మీడియా ని బేస్ చేసుకుని అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమాజంలో ఇటువంటి ఘటనలు మన చుట్టుప్రక్కల చాలా చూస్తున్నాం. సరిగ్గా ఇటువంటి ఘటన నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్ విద్యార్థినుల ఫోన్ నెంబర్లు తీసుకునే వారితో చనువు పెంచుకొని పరిచయం ఏర్పరుచుకొని వారి ద్వారా వారి స్నేహితుల నెంబర్లను ట్రాప్ చేస్తూ సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నా ఉదంతం ఇటీవల బయటపడింది.

 

లైంగిక కోరిక తీరిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం ఈ లెక్చలర్ యొక్క స్పెషాలిటీ. ఈ విధంగా ఒక మహిళ మోసపోవటం తో ధైర్యం చేసి తనలాగా చాలామంది మహిళలు మోసపోయారని తెలుసుకుని ఆ లెక్చలర్ యొక్క ఆగడాళ్లు అంత బయటపెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగి సదరు లెక్చెరర్ ని అదుపులోకి తీసుకున్నారు.  పోలీస్ స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వటంతో అమ్మాయిలను ట్రాప్ చేయడంలో ఈ లెక్చరర్ చేసిన ఆగడాలు అడ్డంగా దొరికిపోయాయి. ఈ లెక్చరర్ పేరు ప్రశాంత్. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రశాంత్, ఎమ్మెస్సీ పూర్తి చేసి ఒక ప్రయివేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు.

 

విద్యార్థినిల ద్వారా యువతులు,విద్యార్ధినులు, వివాహితల ఫోన్ నెంబర్లు సేకరించేవాడు. వారిని ఆకట్టుకునేలా మేసేజ్ లు పంపుతూ  ప్రేమలోకి దింపుతాడు అని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా అమ్మాయిలతో మీరు బాగున్నారు అందంగా ఉన్నారు అంటూ మాటలు కలిపి  పరిచయం పెంచుకుని వారి ఫోటోలు సేకరించేవాడు. వాటిని మార్ఫింగ్ చేసి వారికి పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు.

 

అలా భయపెట్టి అతడి వద్దకు వచ్చిన ఆడవారితో తన కామ కోరికలు తీర్చుకుంటాడని లేకపోతే సదరు మహిళా ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసి బెదిరింపులకు పాల్పడుతడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కామాంధుడు లెక్చరర్ చేతిలో పదుల సంఖ్యలో అమ్మాయిలు మోసపోయారని దీంతో ఫోన్ ను  పోలీసులు పరీక్షల  నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు  పంపించారు. ఎంతో మంది అమాయక మహిళలను, యువతులను  మోసం చేసిన ప్రశాంత్ కు బెయిల్ లేకుండా  జైలుకు పంపినట్లు నెల్లూరు దిశ పోలీసు స్టేషన్  డీఎస్పీ నాగరాజు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: