దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లాక్ డౌన్ లాక్ డౌన్ కు నిబంధనలను భారీగా సడలిస్తోంది. 
 
దీంతో రోజురోజుకు మన గురించి మనం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నాలుగో విడత లాక్ డౌన్ అమలవుతోంది. ఐదో విడత లాక్ డౌన్ కూడా అమలులోకి వస్తే ప్రమాదమని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గతంలో ఫ్రీ క్వారంటైన్ అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పెయిడ్ క్వారంటైన్ లను అమలు చేస్తున్నాయి. 
 
దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి విమానంలో వెళ్లినా ఒక వారం రోజులు క్వారంటైన్ లో మరో వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉండేలా నియమనిబంధనల్లో మార్పులు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఒక వ్యక్తికి ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైద్యానికి అవుతున్న ఖర్చు 2,70,000 రూపాయలు. 
 
రానున్న రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే మూడు లక్షల రూపాయలు కరోనా చికిత్స కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో లాక్ డౌన్ ను ఎత్తివేసి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించదని ప్రకటన వెలువడితే మాత్రం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల కరోనా భారీన పడకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: