టీటీడీ భూముల విక్రయాల విషయంలో వివాదానికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ భూముల  అమ్మకానికి సంబంధించి తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానానికి చెందిన 50 ఆస్తులను విక్రయించాలి అని 2016 జనవరి 30వ తారీఖున టీటీడీ ట్రస్ట్ బోర్డు తీర్మానించింది. దీనికి సంబంధించి తీర్మానం నెంబర్ 253 నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ వ్యవహారంపై మతపెద్దలు, ధార్మిక సంస్థలు మరియు భక్తులు ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది.

 

కాగా ఈ భూముల విక్రయాన్ని ప్రతిపక్షాలు హైలెట్ చేస్తూ రాజకీయాలు చేయటంతో ఈ విషయంలో వైయస్ జగన్... టీటీడీ అధికారుల పై సీరియస్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని సీరియస్ అయ్యారట. ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలు ఏకంగా తిరుమల తిరుపతి ని  వైయస్ జగన్ అమ్మేస్తున్నారు అని దుష్ప్రచారానికి పాల్పడటం పై టీటీడీ అధికారులు నోరు మెదపకపోవడం పై జగన్ ఆగ్రహం చెందినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

 

అయితే భూముల విక్రయాలు విషయంలో వెనక్కి తగ్గిన జగన్ సర్కార్ సొంతంగా తీసుకున్న నిర్ణయం కాకపోవడంతో… ఈ విషయం పై జరుగుతున్న రగడ మొత్తం కేంద్రం దృష్టిలో పెట్టాలని ఆలోచిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అమలు అయిన నిర్ణయాన్ని టీటీడీ నియామకాల ప్రకారం ప్రస్తుతం అధికారంలో వైసిపి రావడంతో దాన్ని అమలు చేస్తున్న తరుణంలో రాజకీయం చేయడంపై జగన్ పూర్తి విషయాన్ని కేంద్ర పెద్దల దగ్గర చర్చించి ప్రజలు ముందు పెట్టాలని రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కతో గత చంద్రబాబు హయాంలో అమలైన ఈ నియామకాల టీటీడీ ల్యాండ్ విక్రయాలు బాగోతం మొత్తం త్వరలో బయట పెట్టనున్నట్లు ఏపీ రాజకీయాలలో బలమైనా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: