జగన్ అందరికీ ఇష్టుడుగా మారడం కష్టమే. అసలు జగన్ ఏంటి ఒక మనిషి ఎవరికీ నచ్చడు. అయితే అన్ని విషయాల్లోనూ నచ్చకపోవడం అంటూ ఉండదు, కొన్ని విషయల్లో కొందరికి నచ్చుతాడు. ఇలా కొన్నిసార్లకు అందరికీ నచ్చుతాడు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నిజాలు అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ప్రతీ నాయకుడూ కొన్ని మంచి పనులు చేస్తాడు. చెడ్ద పనులను పదే పదే ఎండగట్టే ప్రతిపక్షాలు మంచి చేసినపుడు కూడా మెచ్చుకుంటే జనాల్లో విశ్వసనీయత వుంటుంది.

 

నిజానికి ఈ రకమైన రాజకీయం పాతకాలంలో ఉండేది. దేశంలో అత్యంత ప్రజాస్వామిక నేతగా తొలి ప్రధాని పండిట్ నెహ్రూని చెప్పుకునేవారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, దేశానికి తిరుగులేని ప్రజాదరణ కలిగిన ప్రధాని అయి ఉండి నాడు ఏకైక‌ యువ ఎంపీ కొత్తగా పుట్టిన పార్టీ నుంచి గెలిచి తనను నిలదీస్తే ఎంతలా నొచ్చుకోవాలి. కానీ నెహ్రూ ప్రజాస్వామిక సిధ్ధాంతాలను బలంగా నమ్మిన నేత కాబట్టి ఆయన్ని చెప్పమని, తనను విమర్శించమని ప్రోత్సహించేవారు.

 


ఆయనే వాజ్ పేయి. నెహ్రూలోని భావజాలాన్ని స్పూర్తిగా తీసుకుని తాను ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఇందిరా గాంధీ ప్రధాని అయితే ఆమె చేసిన కొన్ని మంచి నిర్ణయాలను నిండు సభలో ప్రశంసించారు.  ఇక రాష్ట్రాల్లో కూడా అప్పటి నాయకులు అలాగే చేసేవారు. ఇక గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చెడిపోయింది. మంచి చేసినా కూడా విమర్శించే  రాజకీయం మొదలైంది.

 

అటువంటి రాజకీయం మనకు వద్దు అని చెప్పి కొత్త రాజకీయం అంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇపుడు ఎందుకో సైలెంట్ గా ఉన్నారు. జగన్ సర్కార్ మంచి పనులు చేసినా ఆయన మెచ్చకుంటున్నారు. ఇక పొరపాటు జరిగితే మాత్రం గట్టిగానే తగులుకుంటున్నారు. కానీ ఆయన అన్నలు మాత్రం జగన్ మంచి చేస్తే మనస్పూర్తిగా అభినందిస్తున్నారు. తాజాగా నాగబాబు టీటీడీ భూముల వేలం విషయంలో జగన్ వెనక్కి తగ్గి జీవోను రద్దు చేయడాన్ని స్వాగతించారు. జగన్ని అభినందించారు.

 

ఇక జగన్ తెలుసు సినీ పరిశ్రమ అభివ్రుధ్ధి కోసం తీసుకున్న్న చర్యలను పెద్దన్న మెగాస్టార్ కూడా ప్రశంసించారు. నిజంగా అలా చేయడం వల్ల వారి గౌరవం కూడా పెరిగింగి. మరి వ్యక్తిగత ద్వేషాలు వద్దు, మంచి రాజకీయం చేద్దాం, ఏది చేసినా ప్రజల కోసమే అని చెప్పె పవన్ కూడా మంచి జరిగినపుడు అభినందించడం  చేస్తే ఆయన సర్కార్ ని విమర్శించినపుడు అందులో చిత్తశుధ్ధిని చూసి జనం పూర్తి మద్దతుగా నిలుస్తారు. మరి పవన్ ఆ విషయంలో కొత్త రాజకీయానికి తెర తీస్తారనుకోవచ్చా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: