గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ ఆస్తుల అమ్మకాల విక్రయానికి సంబంధించి భారీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం గురించి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన జగన్ సర్కార్ పై విమర్శలు చేశాయి. ఆస్తులు వేలం వేస్తున్నట్టు టీటీడీ ప్రకటించడంతో భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి. దీంతో జగన్ సర్కార్ తాత్కాలికంగా టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియను ఆపివేస్తూ ప్రకటన చేసింది. 
 
రాష్ట్రంలో చంద్రబాబు పాలన, జగన్ పాలనను దేవాలయ ఆస్తుల విషయంలో పోల్చి చూస్తే జగన్ పాలన ఎంతో పాలన మెరుగని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కీలకమైన పరిణామాలు అందరికీ గుర్తుంటాయి. చంద్రబాబు హయాంలో పుష్కరాల్లో ప్రమాదం, ఆలయ నిర్మాణాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, పలు ఆలయాల కూల్చివేత, ఆలయాల పునర్నిర్మాణం చేపట్టకపోవడంలాంటివి జరిగాయి. 
 
టీడీపీ హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి ప్రయత్నాలు జరిగాయి. టీటీడీ ఆస్తుల విక్రయానికి కమిటీ వేయడం, టీటీడీ నిధులను ప్రభుత్వం వైపుకు మళ్లించుకోవడం నాడు జరిగాయి. అయితే అప్పట్లో వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు ఆ వ్యతిరేకతను పెద్దగా లెక్క చేయలేదు. ప్రభుత్వాలు అధ్యాత్మిక విషయాల్లో ప్రజల భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
 
భూములను కాపాడటం కోసమే కమిటీలు ఉన్నాయనే అభిప్రాయం ప్రజలకు కలిగేలా చేయాలి. ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనాన్నే ప్రజలు అంగీకరించటం లేదు. జగన్ సర్కార్ ప్రజల అభిప్రాయాలకు స్పందించి తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. నిరర్థక భూములను విక్రయించే బదులు వాటికి ధర్మ సత్రాలుగా మార్చడం లేదా మరో విధంగా చేసి ప్రయోజనం కలిగేలా చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: