మనది వ్యవసాయ ప్రధాన దేశం, ఏపీ కూడా వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్న మాత్రం నిత్యం కష్టాలసాగులోనే జీవితం చాలిస్తున్నాడు. ఈ పరిస్థితి మార్చేందుకు జగన్ సర్కారు ఓ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. అదే రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి. రైతు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.

 

 

ఎప్పుడు ఏ పంట వేయాలి.. ఏ పంటకు గిట్టుబాట ధర వస్తుంది. పంట ఎప్పుడు అమ్ముకోవాలి.. వంటి అనేక అంశాలు రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల్లోసమాచారం ఉంటుంది. వీటి ద్వారా గ్రామ స్థాయిలో రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆర్‌బీకేలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం అవుతాయి. అక్కడి నుంచి విప్లవాత్మక మార్పు ప్రారంభం అవుతుంది.

 

 

అంతే కాదు..ఇకపై కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకింగ్‌ యూనిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రైతుకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటే.. 30 శాతం పంటలు ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే సాధ్యమవుతుందని ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నారు. రైతులు పండించే పంటలు, చేపలు, రొయ్యలు, గుడ్లు, పాలు జనతా బజార్లలో ఉంటాయి. ప్రభుత్వం 30 శాతం కొనుగోలు చేస్తే.. వెంటనే మార్కెట్‌లో పోటీతత్వం మొదలవుతుంది. ఏ దళారీ అయినా గవర్నమెంట్‌ కొనుగోలు చేసే రేట్‌ కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తాడు. వచ్చే సంవత్సరం చివరికల్లా జనతా బజార్లు అందుబాటులోకి రానున్నాయి.

 

 

అంతే కాదు.. 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు తీసుకురాబోతున్నారు. పంటలు పండించే నియోజకవర్గాలు 147గా గుర్తించడం జరిగింది. అక్కడ మొత్తం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌బీకే స్థాయిలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భూసార పరీక్షలు చేయిస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక వ్యవసాయ సలహా బోర్డు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: