ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విపక్షం టీడీపీ అనేక విమర్శలు చేసింది. ఏడాదిలో జగన్ చేసిందేమీ లేదని మండిపడుతోంది. అందుకే ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు.

 

 

అందుకే ఆయన బహిరంగ సవాల్ విసిరారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలంటున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించిందన్నారాయన. హైదరాబాద్‌లో ఉండి జూమ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్‌ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు.. అని ప్రశ్నించారు.

 

 

అట్టడుగు వర్గాలకు కూడా లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందన్న శ్రీకాంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా కుట్ర రాజకీయాలతో అడ్డుతగులుతున్నాడన్నారు. జగన్ అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని హామీలను కూడా మా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

 

 

ఓ వ్యక్తి తప్పతాగి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే డిబేట్లు పెడుతుంది.. టీడీపీ నేతలు రాజకీయం కోసం దేవుడిని కూడా వదలడం లేదని చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని... టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై, ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు సిద్ధమా అని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మరి ఈ సవాల్ పై టీడీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా..? చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: