కరోనా పేషెంట్లకు చికిత్స చేసేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగించడం ప్రమాదకరమా ? ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు ప్రాణం మీదికి తెస్తుందా ? హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

 

కోవిడ్ 19 భారిన పడిన రోగులకు చికిత్స కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా తో ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా మొదలైన తర్వాత హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను కొన్ని దేశాల్లో  ట్రీట్ మెంట్ కోసం వాడుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ , క్లోరోక్విన్ వినియోగం పై వైద్యరంగంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగం పై చర్చ మొదలైంది.

 

కరోనా ట్రీట్ మెంట్ కనుగొనే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అరవై దేశాల్లోని మూడు వందల మంది కరోనా పేషెంట్ పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. లాన్సెట్ అనే జర్నల్ లో వచ్చిన పరిశోధన వ్యాసం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా పేషెంట్ పై  వాడితే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని లాన్సెట్ జర్నల్ స్పష్టం చేసింది.  


 
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పేషెంట్ ను ట్రీట్ చేసేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తాత్కాలికమైనా.. ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో సగటు మానవుడు భయంతో వణికిపోతున్నాడు. బయట తిరగాలంటేనే జంకుతున్నాడు. విధిలేని పరిస్థితుల్లో తన విధులకు హాజరవుతున్నాడు. అయితే కరోనా బాధితులకు గట్టెక్కించేందుకు వ్యాక్సిన్ వస్తే తప్ప ఆ మహమ్మారి నుంచి తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: